న్యూఢిల్లీ మార్చ్ 22
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10 కాగా, డీజిల్ ధర రూ. 95.49గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరగగా, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80, డీజిల్ ధర రూ. 96.83గా ఉంది.ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21, డీజిల్ ధర రూ. 87.47గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82, డీజిల్ ధర రూ. 95.00గా, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 105.51, డీజిల్ రూ. 90.62, చెన్నైలో పెట్రోల్ రూ. 102.16, డీజిల్ ధర రూ. 92.19గా ఉంది.