హైదరాబాద్, మార్చి 22,
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను కలిశారు. మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లోని వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును కావాల్సిన వారికి కేసిఆర్ ప్రభుత్వం కట్టబెడుతోందని ప్రధాని మోడి కే నేరుగా ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదని ఆయన విమర్శించారు.దొంగ సొమ్మును పంచుకోవడానికి ఇద్దరూ కుమ్మక్కైయ్యారని, బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసిచూడనట్లు వ్యవహరించడంవల్ల, బీజేపీకి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో నిధులను కేసీఆర్ సమకూర్చుతున్నారన్నారు.