హైదరాబాద్ మార్చ్ 22
ఆ మధ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్‌రెడ్డి.. ఆ విషయాలనే మాట్లాడలేదన్నారు.. లోపల రేవంత్ నాకు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? అని మీడియాను ప్రశ్నించిన జగ్గారెడ్డి.. అయన ఏం మాట్లాడింది చెప్పకపోతే నేనేదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటారని.. ఆ విషయాలను చెప్పుకొచ్చారు.రేవంత్ అసలు స్వరూపం మీకు తెలియదు.. జగ్గన్నా అని కలిసి పోదాం అని కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.. మెదక్ ఎపిసోడ్ మాట్లాడలేదు.. సీఎం సీరియస్‌గా ఉన్నాడు.. నాకు ఫోన్ వచ్చింది.. ఏ సమయంలో ఏమవుతుంది అనేది తెలియదని చెప్పాడని.. గవర్నర్ ని కూడా అందుబాటులో ఉండాలని చెప్పారని.. ఏమైనా అయితే మనం రెడీగా ఉండాలని రేవంత్ చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.. ఓవైపు.. అసెంబ్లీలో మాకు వాళ్లకు ఫైటింగ్ నడుస్తుంది.. సీఎం సీరియస్ గా ఉంటే సభ నడుస్తుందా..? అని ప్రశ్నించారు. ఇక, నేనేమో సోషల్ మీడియాలో వీక్.. సమాజం అంతా డేరా బాబా గురించి తెలుసు.. అత్యాచారాలు చేశారు అని అందరికీ తెలుసు.. కానీ, జైలు నుండి బయటకు వస్తే లక్షల మంది క్యూ కట్టారని ఎద్దేవా చేశారు. నేను చెప్పేది దైవ సాక్షిగా చెప్తున్న.. ఇది పార్టీ వ్యవహారం కాదు.. రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి మధ్య క్యారెక్టర్ పై చర్చ అన్నారు.. ఇక, నా తో రేవంత్ వ్యవహరించిన తీరు కరెక్ట్ నా..? జగ్గారెడ్డికే ఇలా జరిగితే.. మిగిలిన వాళ్లకు ఏం చేస్తారు? అని నిలదీశారు.. ఎవరికి టికెట్ ఇస్తారు.. ఏమవుతుంది అని అనుమానంగా ఉంది.. ఇప్పుడు నాకు శీల పరీక్ష వచ్చిందన్న ఆయన.. నేను సీతమ్మ లెక్క.. అగ్ని పరీక్ష అంటే కాలి పోతానని వ్యాఖ్యానించారు.