న్యూఢిల్లీ మార్చ్ 22
పెట్రోల్ తో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు రూ. వెయ్యికి పైగా పెరిగాయి.పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పట్ల గృహిణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంట నూనెల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితుల మధ్య వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని మండిపడుతున్నారు. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,002 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,008కి చేరింది. ఇప్పటికే వంటింట్లో ఉపయోగించే నూనెలు, పప్పు ధాన్యాల ధరలు అమాంతం పెరిగిన విషయం విదితమే.