YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొంప మీదకు బలం

కొంప మీదకు బలం

విజయవాడ, మార్చి 23,
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. అవును. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు చూస్తే, అది నిజమే అనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏదో ఉద్దరిస్తారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే, ఇప్పుడు, ఆ భారీ మెజారిటీనే, వైసీపీ పాలిట యమపాశంలా మారిందనే మాట పార్టీలోనే ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు జగన్ రెడ్డి ప్రభుతం  రాజకీయ ప్రత్యర్ధులు లక్ష్యంగా భౌతిక దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తూస్తునే ఉన్నాయి.తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద వరస దాడులు చేయడం మొదలు అసెంబ్లీలో అహంకార ప్రదర్శనల వరకు అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి లేకుండాచేస్తోందని, వైసీపీ అభిమానులు, క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు, ఛీ’ తప్పుచేశామని వాపోతున్నారంటే పరిస్థతి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చును అంటున్నారు.  ముఖ్యంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు,మాట్లాడే పద్దతి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, సామాన్యుల మొదలు మేథావుల వరకు ప్రతి ఒక్కరు జగన్ రెడ్డి ప్రభుత్వం తీరును సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కుతూ, అదేమంటే, సభ్యులను సస్పెండ్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, దున్నపోతు మీద వడగళ్ళ వాన అన్న చందంగా, ప్రభుత్వం మాత్రం అదే ధోరణి కొనసాగిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగిస్తోంది. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచి, ప్రభుత్వం సభలో తమకున్నమెజారిటీని అడ్డుపెట్టుకుని, అయినదానికి కాని దానికీ, తెలుగు దేశం సభ్యులను స్పీకర్ సాయంతో సస్పెండ్ చేయడం సర్వసాధారణమవుతోందనే విమ‌ర్శ ఉంది. స‌భ‌లో జంగారెడ్డిగూడెం నాటు సారా మరణాలతో పాటు పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్,టీడీపీ ఎమ్మెల్యేల్లో బెందాళం అశోక్, రామరాజు, సత్యప్రసాద్‌, రామకృష్ణలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.   సభకు పదేపదే ఆటంకం కలిగించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. జంగారెడ్డిగూడెం ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. నిజానికి, ప్రజల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ప్రతిపక్ష సభ్యులు ప్రధమ కర్తవ్యం. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం,ప్రజల సమస్యలు వదిలి, పెగాసస్ స్పైవేర్ విషయాన్ని పైకి తెచ్చి రాద్దాంతం చేయడంతో గత నాలుగైదు రోజులుగా సభ కార్యక్రమాలు ఏక పక్షంగా సాగుతున్నాయని అంటున్నారు. ఇక పెగాసస్ స్పైవేర్’  విషయానికి వస్తే, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యఆధారంగా,  వైసీపీ ప్రభుత్వం సభాసంఘం విచారణ వరకు వెళ్ళడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట తప్ప మరొకటి కాదని అంటున్నారు. అంతే కాదు, మరో ఆధారం ఏదీ లేకుండా, కేవలం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన, అస్పష్ట, నిరాధార వ్యాఖ్య ఆధారంగా ప్రభుత్వం దూకుడు చూపడం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం బూమ్రాంగ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి  పెగాసస్ స్పైవేర్’ను ప్రభుత్వాలు తప్ప ఎవరంటే వారు కొనుగులు చేయడం అయ్యే పని కాదు. అంతే కాకుండా, పెగాసస్ స్పైవేర్’ కొనడం నేరం కాదు. దుర్వినియోగం చేస్తేనే, అది నేరం అవుతుంది. అలాంటిది ఏదైనా ఉందనే అనుమానం ఉంటే ప్రభుత్వం, ఏసీబీ, సీఐడీ లేదా సీబీపీ విచారణకు ఆదేశించవలసింది. కాదంటే,సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీని నివేదించ వలసింది, అవేవీ కాకుండా, అధికార పార్టీ సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండే సభా సంఘం ఏర్పాటు చేసిందంటే, రాజకీయ రచ్చ చేసేందుకే అని వేరే చెప్ప నక్కర లేదని నిపుణులు అంటున్నారు.

Related Posts