YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హస్తినకు చేరిన పాలిటిక్స్

హస్తినకు చేరిన పాలిటిక్స్

హైదరాబాద్, మార్చి 23,
తెలంగాణలో వరిపై యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. యాసంగి పంట చేతికొస్తున్న తరుణంలో ఎవరు కొనాలన్న దానిపై పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బియ్యం కాదు వడ్లు కొనాల్సిందేనంటూ KCR వ్యూహం మారిస్తే.. రా రైస్‌ ఎంతిచ్చినా సరే బాయిల్డ్‌ మాత్రం వద్దంటోంది కేంద్రం. పేచీ మళ్లీ బాయిల్డ్‌ దగ్గర వచ్చి ఆగడంతో వరి వార్‌ కాస్తా హస్తినకు చేరింది.వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటున్నారు కేసీఆర్‌.రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం ఎంతైనా సరే సేకరించడానికి సిద్దమంటోంది కేంద్రం.రాష్ట్రం అడిగితే కేంద్రం అంటోంది. కానీ ఇక్కడే పీటముడి పడుతోంది. రా రైస్‌ ఎంతిచ్చినా తీసుకోవడానికి రెడీ అంటోంది కేంద్రం. అయితే తెలంగాణలో పండుతున్న యాసంగి పంట బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే పనికొస్తుందని గతంలోనే క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి .గతంలో ఇచ్చినట్టు బియ్యంగా మార్చితే కేంద్రం తీసుకునే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వ్యూహం మార్చింది. పంజాబ్‌ తరహాలో వడ్లు సేకరించాలంటూ కేంద్రం కోర్టులో బంతిని తోశారు కేసీఆర్‌.దీనిపై బీజేపీ నాయకుల వెర్షన్‌ మరోలా ఉంది. దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలోనే ఎందుకు సమస్య వస్తుందని ప్రశ్నిస్తోంది. భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందని.. రా రైస్‌ ఎంతిచ్చినా ఒకే అంటోంది. వరి వేస్తే ఉరేనని, కొనుగోలు కేంద్రాలు ఉండవని రైతులకు వార్నింగ్‌ ఇచ్చింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నిస్తోంది బీజేపీ. కేంద్రం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తుందని కౌంటర్‌ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు.వరి విషయంలో కేంద్ర, రాష్ట్రాలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించింది కాంగ్రెస్. తమకు అప్పగిస్తే రెండు రోజుల్లో పంటంతా సేకరించి చూపిస్తామంటున్నారు ఆ పార్టీ ఎంపీలు.మొత్తానికి వరిపై యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. మరి రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్నట్టు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుందా? తాడో పేడో తేల్చుకుంటామన్న కేసీఆర్‌ దీనిపై ఎలాంటి ఎత్తుగడలతో వెళతారు.

Related Posts