విజయవాడ
టీడీపీ నేత కేశినేని శ్వేతను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. రాష్ట్రంలో జె బ్రాండ్, కల్తీసారా లపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేత గారిని అడ్డుకునేందుకు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ దుర్మార్గపు పాలన ... ఇది ఒక అసాంఘిక చర్య అని అరోపించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర లోనే వున్నాయి అని హెచ్చరించారు.