YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దిశ పెట్రోలింగ్ వెహికల్స్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

దిశ పెట్రోలింగ్ వెహికల్స్ను ప్రారంభించిన సీఎం  వైఎస్ జగన్

అమరావతి
మహిళల భద్రతకోసం ఏర్పాటు చేసిన దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మరియు మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం  విజిబుల్ పోలీసింగ్ను మెరుగుపరచడం కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్ ను  ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు (స్కూటర్లు) మహిళల రక్షణ కోసం  పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న  పోలీస్ శాఖ 163 ఫోర్ వీలర్ వాహనాలను కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేసింది. ఈ వాహనాలన్ని  జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుండి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక జీపీఎస్    ట్రాకింగ్ వ్యవస్థతో కూడి  ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు జనసంచారం తక్కువ ఉన్న  సమస్యాత్మక ప్రాంతాలలో నేరం జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని  ప్రదేశాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయి.
మహిళలు తమ మొబైల్ ఫోన్ లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా అనంతరం ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు తమ చేతిలోని SOS లేదా మొబైల్ ను షేక్ చేయడం ద్వారా భాదితుల వద్దకు చేరుకునే  పోలీసులు సమయం  పట్టణ ప్రాంతాల్లో ప్రతిస్పందన సమయం 4-5 నిమిషాలు అదే గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు తగ్గింది. ఈ ప్రతిస్పందన సమయం మరింత తక్కువగా ఉండడానికి ఈ ప్రత్యేక వాహనాలు తోడ్పడతాయి. ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్ ను కోటి పదహారు లక్షల మంది  మహిళలు తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

Related Posts