కమాన్ పూర్ మార్చి 23
ఆపరేషన్ చబుత్ర లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ అదేసానుసారం 1టౌన్ సీఐ రమేష్ బాబు, రామగుండం సీఐ లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో రాత్రి 10.00 గంటలకు ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో ఆర్టీసీ బస్టాండ్, ఏన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీ, కృష్ణ నగర్ ఇతర ప్రాంతాలలో లో రాత్రి 10 గంటల తరువాత రోడ్లపై అనవసరంగా తిరిగుతు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ల సౌండ్ పెంచుతూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా గల్లీలో తిరుగుతున్నా వారిని, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని, మద్యం సేవించి న వారిని పట్టుకున్నారు వారిపై ఏమైనా నేరచరిత్ర ఉన్నాయ లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ ఫింగర్ ప్రింట్స్ చెక్ డివైజ్ తో చెక్ చేయడం జరిగింది. అలాగే అర్ధరాత్రి గల్లీలో మద్యం సేవించి ద్విచక్ర వాహనల పై తిరుగుతు జులాయి గా తిరుగుతూన్న వారిపై కేసులు నమోదు చేసి 1టౌన్ పోలీస్ స్టేషన్, ఏన్టీపీసీ కి తరలించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ గిరి ప్రసాద్ మాట్లాడుతూ...అసాంఘిక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు పోకిరీలుగా అవతారం ఎత్తి తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని ఏసీపీ గారు సూచించారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ రోజు నుండి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుంది అని రాత్రి సమయంలోఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ, గుంపులుగా కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నా రు. యువకులు ఇప్పటినుంచే, చట్టవ్యతిరేకమైన, నేరాల్లో పాల్గొంటే భవిష్యత్ ఉండదని యువకులకు సూచించారు. ప్రతి రోజు రాత్రి 10 గంటలలోపే పని ముగించుకొని ఎవరి ఇండ్లలో వారు ఉండాలి అలా కాకుండా అనవసరంగా రోడ్లపై మద్యం సేవిస్తూ గల్లీలో తిరుగుతూ, పోకిరి చేష్టలు చేసేవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీపీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐలు 2టౌన్ శ్రీనివాసరావు, రామగుండం సిఐ లక్ష్మి నారాయణ, సయ్యద్ అఫ్జలొద్దిన్, ఎస్సైలు రమేష్, స్వామి, నరేష్ కుమార్, శైలజ, అంతర్గం ఎస్ ఐ శ్రీధర్,ఏన్టీపీసీ ఎస్ ఐ కుమార్ కళాధర్ రెడ్డి,మరియు ఏఎస్సైలు,40 మంది కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గోన్నారు.