చింతలపూడి
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన గంజాయిని ఈ రోజు తమ్మిలేరు జలాశయం ఒడ్డున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నత అధికారుల సమక్షంలో మంటల్లో కాల్చారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో పట్టుబడిన గంజాయి సుమారు 557 కిలోలు రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తమ్మిలేరు జలాశయం ఒడ్డున గంజాయిని కాల్చి వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణాజిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.