న్యూఢిల్లీ
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణత్యాగంతో (అందులో 5 గురు విజయవాడ వారు) సాధించు కున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నష్టాల సాకుతో ప్రైవేట్ పరం చేయడం ఎంత వరకు సమంజసం అని ఎంపి కేశినేని శ్రీనివాస్ ( నాని ) లోక్ సభలో ప్రశ్నించారు. దేశంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలను కుంటి సాకులు చూపించి ప్రైవేట్ పరం చేస్తున్నారని, కానీ ప్రజలకు ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మడం, ప్రైవేటు పరం చేయడం వంటి ప్రయత్నా లను టిడిపి పార్టీ పూర్తిగా వ్యతిరేకి స్తోందని దీనిపై కేంద్ర మంత్రి వర్యులు తగిన సమాధానం చెప్పాలని అయన ప్రశ్నించారు.
దీనికి కేంద్ర మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ సమాధానం ఇస్తూ స్టీల్ ప్లాంట్ తగిన లాభాల్లో లేకపోవడం, గత రెండు సంవత్సరా ల నుంచి తయారీ ఖర్చు రెట్టింపు అవ్వడం, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యల వలన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.