హైదరాబాద్ మార్చ్ 23
ఢిల్లీ వేదికగా బీసీల పోరాటం ముమ్మరం..మూడు వారాల పాటు పలు కార్యక్రమాలు..బీసీ బిల్లు సాధనే లక్ష్యం.. -దాసు సురేష్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్..జాతీయ బీసీ సంక్షేమ సంఘం చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, జనగణనలో బీసీ కుల గణన కొరకు ఈ నెల 21 నుండి ఏప్రిల్ 8 వరకు ఢిల్లీలో పలు వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ తెలిపారు. బుదవారం ఇక్కడ మద్య సమావేశం లో మాట్లాడుతూ బీసీ ముఖ్య నాయకులతో కలిసి మూడు వారాల పాటు ఢిల్లీలోనే మకాం వేసి జాతీయ పార్టీలకు చెందిన బీసీ ఎంపీ లతో కలిసి ఉద్యమిస్తామన్నారు. అందులో భాగంగా మార్చి 21 నుండి 26 వరకు బీసీ ఎంపీలతో, వివిధ జాతీయ పార్టీ ముఖ్య ప్రతినిధులతో చర్చలు, సమావేశాలు ఏర్పాటు చేసామమన్నారు.మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకు కేంద్ర మంత్రులతో చర్చలు, బీసీ ఎంపీలతో బీసీ బిల్లు ఆవశ్యకతపై భారీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు .ఏప్రిల్ 4 నుండి 8 వరకు పార్లమెంటు లోపల బీసీ ఎంపీలతో నిరసన కార్యక్రమాలు, పార్లమెంటులో బీసీ బిల్లుకై వ్యూహ ప్రతివ్యూహాలు, నిశిత పర్యవేక్షణ, సమయానుకూల సమావేశాలు. తదుపరి కార్యాచరణపై ఉమ్మడి నిర్ణయం తదితర కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.మూడు వారాల పాటు కొనసాగే ఈ ఢిల్లీ పర్యటనలో తమ సమయానుకూలంగా బీసీ ప్రతినిధులు, మేధావులు ., రచయితలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు