YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జే బ్రాండ్ ను నిషేధించాలి టీడీపీ ఎమ్మెల్యేలు

జే బ్రాండ్ ను నిషేధించాలి టీడీపీ ఎమ్మెల్యేలు

విజయవాడ
జే బ్రాండ్ ని నిషేధించాలని జంగారెడ్డి మరణాలకు నైతిక బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ శాసనసభ్యులు నాయకులు ధర్నా నిర్వహించారు. మద్యనిషేధం పేరుతో మద్యం అమ్మకాలు తగ్గించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా జే బ్రాండ్స్ తయారీకి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటు టిడిపి శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గత కొన్ని రోజులుగా జంగారెడ్డిగూడెం మరణాలపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే అయితే సభా కార్యక్రమాలను అడ్డుకుంటునరని టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు ఆ పార్టీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం దుకాణాల వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు బుధవారం విజయవాడలోని ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద టిడిపి శాసన సభ్యులు నిరసనకు దిగారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు ఏర్పాటుచేయగా అనుకోని విధంగా ఆ పార్టీ శాసన సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్సైజ్ ప్రధాన కార్యాలయం వద్ద ముందస్తు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.  జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం అవి సహజ మరణాలుగా చిత్రీకరించడం సిగ్గుచేటని కనీసం శాసనసభలో తమను మాట్లాడనీయకుండా సస్పెండ్ చేయడం చూస్తుంటే తమ తప్పు బయటపడుతున్న భయం ఆ పార్టీ నేతలు కనబడుతోందని ధ్వజమెత్తారు.

Related Posts