YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

చిక్కుల్లో సల్మాన్

చిక్కుల్లో సల్మాన్

ముంబై, మార్చి 23,
సల్మాన్ మరోమారు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అంతే తరచుగా వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటాడు. తాజాగా జర్నలిస్ట్ పై సల్మాన్ దాడి కేసుతెరపైకి వచ్చింది. 2019లో జరిగిన ఈ వివాదానికి సంబంధించి ఓ జర్నలిస్టు చేసిన ఫిర్యాదుపై నటుడు సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్‌లకు అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదైనట్లు పోలీసు నివేదికలో పేర్కొన్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఆర్ ఖాన్ మంగళవారం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం సమన్లు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్, షేక్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదులో కోరారు.అసలు ఆ దాడి సంగతేంటంటే… 2019 ఏప్రిల్ 24న ముంబై వీధిలో సల్మాన్ సైకిల్‌పై వెళుతుండగా కొందరు మీడియా వ్యక్తులు ఆయన ఫోటోలను తీశారట. అదే సమయంలో ఫోటోలు తీస్తున్న తన మొబైల్ ఫోన్‌ను పగలగొట్టిన సల్మాన్ అక్కడే వాగ్వాదానికి దిగి, తనను బెదిరించాడని పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎన్ నగర్ పోలీసులను కోర్టు గతంలో ఆదేశించింది. ఇక కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం సల్మాన్ గాడ్ ఫాదర్, టైగర్ 3, కభీ ఈద్ కభీ దీపావళి వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Related Posts