YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పుట్టపర్తిలో ఆనందం

పుట్టపర్తిలో ఆనందం

అనంతపురం, మార్చి 24,
ఉగాది వచ్చేస్తోంది.. తెలుగు వారి పండుగతో పాటు కొత్త జిల్లాల్లో డబుల్ ఉగాది జరగనుంది. దీనికి కారణం.. ఉగాది నుంచి పాలన సాగించేందుకు యంత్రాంగం చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సిద్ధమవగా.. తాజాగా అన్ని శాఖలు ఉద్యోగుల విభజనతో పాటు కార్యాలయాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అనంతలో కొత్త శ్రీ సత్యసాయి జిల్లా పేరుతో ఆవిర్భవిస్తున్న పుట్టపర్తిలో అధికారుల చర్యలతో సందడి కనిపిస్తోంది.ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న అనంతను అనంతపురం జిల్లా గాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను విభజించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో అభ్యంతరాలను కూడా వినతుల రూపంలో తీసుకుంది. అదే సందర్భంలో కొత్త జిల్లాలో ఉగాది నుంచి పాలన సాగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాయాల కోసం గుర్తించిన భవనాల ఆధునికీకరణ పనులు ఊపందుకున్నాయి. ప్రతి కార్యాలయం ఎదుట బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ తో పాటు ఎస్పీ కార్యాలయం ఇతర భవనాలను గుర్తించి అక్కడ కావాల్సిన మౌళిక వసతులను కూడా సిద్ధం చేస్తోంది…మరోవైపు జిల్లాలోని అన్ని శాఖల్లో ఉద్యోగుల విభజన కూడా దాదాపు పూర్తైంది. ఇందుకు సంబంధించిన నివేదికల్ని కూడా జిల్లా కలెక్టర్ కు పంపారు. అదే సందర్భంలో కొత్త జిల్లాలో కార్యాలయాల్ని కూడా గుర్తించి.. బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం కోసం గుర్తించిన డ్వాక్రా బజార్ భవనాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటు విద్యాశాఖ పరంగా చూస్తే.. బుక్కపట్నంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ఊపందుకున్నాయి.రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదలైన తరువాత ఉపాధ్యాయుల విభజన ఉంటుంది. అప్పటి దాకా ఏ జిల్లా పరిధిలోని వారు అక్కడే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా ఉద్యోగుల విభజన, కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న చంద్రనాయక్‌ను అనంత జేడీఏగా కొనసాగిస్తూ.. పట్టపర్తికి డీడీఏను నియమిస్తారన్న ప్రచారం సాగుతోంది. జిల్లా వైద్యశాఖలో మొత్తం 195మంది వైద్యులు ఉండగా.. వీరిలో వందమందిని అనంతపురం జిల్లాకు, అలాగే 95మందిని పుట్టపర్తికి కేటాయించారు.కొత్త జిల్లాల విభజనలో భాగంగా పంచాయతీలతో మొదలుకుని, అన్నింటినీ విభజించారు. ఆ మేరకు లెక్కలు తేల్చారు. అనంత జిల్లాలో ప్రస్తుతం ఉన్న జనాభా, భూవిస్తీర్ణం, మండలాలు, పంచాయతీలు, గ్రామాలు, రహదారులు, చెరువులు, ఆయకట్టు భూములను విభజించారు. రెండు జిల్లాలకు సంబంధించి లెక్కలు తేల్చారు. జిల్లాలోని పంచాయతీలను విభజన చేశారు. మొత్తం 1044 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో అనంతపురం జిల్లాకు 619 పంచాయతీలు రాగా.. వీటి పరిధిలో 1210 గ్రామాలున్నాయి. సత్యసాయి జిల్లాకు 425 పంచాయతీలు ఉండగా.. ఇందులో 2164 గ్రామాలున్నాయి. దీనిని బట్టి అనంత జిల్లా కన్నా 954 గ్రామాలు పుట్టపర్తి జిల్లాలో అధికంగా ఉండటం విశేషం. జనాభాలోనూ రెండు జిల్లాలకు విభజించారు. మొత్తం 40.81 లక్షలు ఉండగా అందులో అనంత జిల్లాకు 23.59 లక్షలు పుట్టపర్తి జిల్లాకు 17.22 లక్షలు వచ్చారు. మొత్తం మీద ఓ వైపు సంస్థాగతంగా విభజన.. మరోవైపు అన్ని శాఖల అధికారుల విభజన.. దాదాపు పూర్తయ్యాయి. ప్రజలకు అందుబాటులో ఉండేలా భవనాలను గుర్తిస్తూ పనులు కూడా సాగిస్తున్నారు.

Related Posts