నెల్లూరు, మార్చి 24,
ఏపీలో అమ్ముతున్న పలు రకాల మద్యం బ్రాండ్లలో ప్రాణాలు తీసేంత హానికర రసాయనాలు ఉన్నాయంటూ ఏపీలో తీవ్ర కలకలం చెలరేగుతోంది. రాష్ట్రంలో అమ్ముతున్న ఐదు రకాల బ్రాండ్లను కెమికల్ టెస్టులకు పంపగా.. వాటన్నిట్లోనూ ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఓల్డ్ టైమర్ ,చాంపియన్, రాయల్‌సింహ, గ్రీన్ చాయిస్, సెలబ్రిటీ.. లాంటి దేశంలో మరెక్కడా లేని.. ఊరుపేరు లేని.. బ్రాండ్ల మద్యాన్ని పరీక్షలకు పంపించారని అంటున్నారు. అందులో విష పదార్థాలు ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని తెలుస్తోంది. ఆ మద్యం బ్రాండ్లు తయారు చేసే కంపెనీలు కూడా.. జగనన్నకు అత్యంత సన్నిహితులైన వైసీపీ పెద్దలవేననే అనుమానం కూడా ఉంది.చాలామందికి జే-బ్రాండ్స్ లిక్కర్‌పై సందేహాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్త ఒకరు చొరవ తీసుకుని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న ఓల్డ్ టైమర్, చాంపియన్, రాయల్‌సింహ, గ్రీన్ చాయిస్, సెలబ్రిటీ విస్కీ-బ్రాందీలను కొని.. వాటిని తమిళనాడులోని ప్రతిష్టాత్మక SGC ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై అనే ల్యాబ్‌కి పరీక్షల కోసం పంపారని.. ఆ రిపోర్టులు ఇవేనంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎస్‌జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్‌లలో పరీక్షించిన మద్యం రకాలన్నీ దాదాపుగా ‘స్లోపాయిజన్’తో సమానమని తేలిందని అంటున్నారు. మద్యంలో... బెంజోక్వినోన్, స్కోపారోన్, డైమితోక్సినామిక్ యాసిడ్, పైరోగలాల్, వొల్కెనిన్, కాప్రొనల్యాక్టమ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల.. చర్మం పైపొరల్లోని సన్నని నరాలు క్రమంగా బలహీనపడటం.. దీర్ఘకాలంలో రక్త ప్రసరణపై ప్రభావం చూపడం.. ఆయాసం.. మూత్రపిండ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. ఫలానా బ్రాండ్ తాగితే.. ఫలానా సమస్య వస్తుందంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఆ మేరకు ఇవే ల్యాబ్ టెస్ట్ ఫలితాలంటూ కొన్ని రిపోర్టు కాపీలు కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని రిపోర్టులు ఇలా