YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేకు 10 లక్షల చెత్త మాఫీ

ఎమ్మెల్యేకు 10 లక్షల చెత్త మాఫీ

కాకినాడ, మార్చి 24,
చట్టం ముందు అందరూ సమానమే, కానీ, అస్మదీయులు కొంచెం ఎక్కువ సమానం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. చెత్త పన్ను, ఆస్తి పన్ను వసూలుకు  వైసీపీ ప్రభుత్వం దా’రుణ’ పద్దతులను అవలంబిస్తోంది. చెత్త పన్ను కట్టని షాపుల ముందు చెత్తపోయడం, ఆస్తి పన్నుకట్టని ఇళ్ళలోకి అధికారులు, సిబ్బంది జొరబడి సామాన్లు బయట పడేయడం, జప్తు చేయడం వంటి, చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల పన్ను కట్టడం లేదని ఇళ్లకు తాళాలేయడం, సీజ్ చేయడం నీటి కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటివి చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నఈ అనాగరిక పన్ను వసూలు  పద్దతులు. ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.అయినా పురపాలక శాఖ మంత్రి, బొత్స సత్యనారాయణ, పన్ను కట్టని ప్రజల ఆస్తులు జప్తు చేయడం కొత్తేమి కాదని, ఎప్పటి నుంచో ఉందని ప్రభుత్వ చర్యలను సమర్ధించు కుంటున్నారు. అదొకటి అలాఉంటే, సామాన్య ప్రజల నుంచి వంద, వెయ్యి పన్నును ముక్కు పిండి వసూలు చేస్తున్న, జగన్ రెడ్డి ప్రభుత్వం, అస్మదీయుల విషయంలో మాత్రం రూ. లక్షల్లో పన్నును మాఫీ చేస్తోంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలా అయిన వారికి ఆకుల్లో,కానీ వారికీ కంచాల్లో అన్న విధంగా, సామాన్య ప్రజలను అవమానాలకు గురిచేసి, అప్పులు చేసినా పన్నులు కట్టాలని బలవంతం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ కుబేరులకు మాత్రం పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వడం ఏమిటని, సామాన్యులు సిబ్బందిని నిలదీస్తున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించదా, అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ఇలా ఒకరికో రూలు, ఇంకొకరికి ఇంకో రూలు అమలు చేయడం తమకు కూడా ఇబ్బందిగానే ఉందని అయినా పై నుంచి వస్తున్న వత్తిళ్ళకు తలొగ్గక తప్పడం లేదని కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్ళ బోసుకుంటున్నారు. నిజానికి,గతంలో ఎప్పుడూ ఇంటి పన్ను వసూలుకు ఇంతగా వత్తిడి పెట్టలేదని అంటున్నారు.గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవలి కాలంలో సమాన్య పేద, మధ్య తరగతి ప్రజలు ఇంటి పన్ను, చెత్త పన్ను కట్టడం లేదని ఇళ్లకు తాళాలేయడం, సీజ్ చేయడం నీటి కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటివి చేస్తున్నారు. దీంతో ప్రజలు నానా తిప్పలు పడి, గతయంటాం లేని పరిస్థితిలో అధిక వడ్డీకి అప్పులు చేసి పన్నులు కడుతున్నారు. ఇదే సమయంలో తూగో జిల్లా కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏకంగా రూ. పది లక్షల పన్ను మినహాయింపును ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పన్ను కట్టడం లేదు. అదేమంటే ఆదాయం లేదని, పన్ను మినహాయింపు కోరారు. అయితే అధికారులు, సామాన్యులకు,ఎవ్వరికీ ఇవ్వని మినహయింపు ఎమ్మెల్యేకు ఇచ్చారు. ఎమ్మెల్యే అడిగితే ఎలా కాదనగలం, అందులోనూ ఆయన అధికార పార్టీ ఎమ్మెల్ల్యే , సో .. ఆయన అంతటివాడు తమ ముందు చేతులు చాచి మినహాయింపు కోరడమే, మహాభాగ్యం అనుకున్నారో ఏమో కానీ, వెంటనే రూ.10 లక్షలు మినహాయింపు ఇచ్చేశారు. ద్వారంపూడికి కాకినాడలో గోడౌన్లు ఉన్నాయి. ఆదాయానికి కొదవలేదు. అయినా, ఆదాయం లేదని అంటే. అధికారులు నిజం అని నమ్మేశారు. పన్ను మినహాయింపు ఇచ్చేశారు. అసలే అడ్డగోలుగా ఆస్తి పన్ను పెంచడమే కాకుండా, దేశంలో ఇంకెక్కడా లేని చెత్త పన్ను విధించడంతో కాక మీదున్న జనం, కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే ద్వారంపూడికి మినహాయింపు ఇవ్వడంతో,కాకినాడలోనే కాకుండా  రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్త పరుస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులను, పేద మద్యతరగతి ప్రజల నుంచి బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యహారం కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్లు ఉందని ప్రజలు మండి పడుతున్నారు. సర్కార్’ సరైన సమాధానం ఇచ్చేందుకు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

Related Posts