ముంబై, మార్చి 24,
కరోనా ఖతమైంది. కేసులు దాదాపు లేవు. భయం అస్సలే లేదు. పూర్తిగా మామూలు పరిస్థితులు వచ్చేశాయ్. ఇంకేం, కొవిడ్ ముగిసిందిగా ఇక ఆఫీసులకు వచ్చేయండంటూ కంపెనీలు ఉద్యోగులను కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేండ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాల బాట పట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. అత్యధిక జీతాలతో వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్)కు అలవాటుపడిన పలువురు ఉద్యోగులు ఈ వెసులుబాటు లేకుంటే ఉద్యోగాన్ని వదులుకునేందుకూ సిద్ధమయ్యారు. కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు డబ్ల్యూఎఫ్‌హెచ్‌కు స్వస్తి పలకనున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ పద్ధతిని తొలగిస్తే ఉద్యోగాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దసంఖ్యలో ఉద్యోగులు చెప్పారని స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ సంస్ధ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది.రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం చేసింది చాలు.. ఇప్పటికైనా వర్క్ ప్లేస్‌కు రండంటూ మెసేజులు పెడుతున్నాయ్. కంపెనీలకూ ఇష్టం లేకున్నా.. ఖర్చు తగ్గినా.. ప్రభుత్వాల నుంచి ప్రెజర్ వస్తుండటంతో.. ఎంప్లాయిస్‌ను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాల్లో వేగం పెంచాయి. మార్చి తర్వాత చాలా సంస్థలు ఉద్యోగులు ఆఫీసుకు రావడం కంపల్సరీ చేశాయి. ఫుల్ ఫెడ్జ్‌గా కాకున్నా.. 50-50 రేషియోలో సిబ్బందిని కార్యాలయాలకు రప్పించే పనిలో ఉన్నాయి. కట్ చేస్తే.. కంపెనీలైతే పిలుస్తున్నాయి కానీ, మెజార్టీ ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. రెండేళ్లుగా ఇంట్లో ఉండి పని చేసి.. ఇంటి వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. ఆఫీసు పనితో పాటు ఇంటి పనులూ చక్కబెట్టుకున్నారు. పేరెంట్స్, పిల్లలతో చక్కగా గడిపారు. ఆ మేరకు పని వేళలు చూసుకోకుండా.. పని కూడా బాగానే చేశారు. అవుట్‌పుట్ బాగా పెరిగింది. ఉద్యోగుల విషయంలో కంపెనీలు సైతం హ్యాపీగా ఉన్నాయి. కానీ, కరోనా ఎండ్ కావడంతో ఆఫీసులకు తప్పనిసరి చేస్తుండటంతో ఉద్యోగులు పునరాలోచనలో పడ్డారు. అవసరమా? మళ్లీ ఆఫీసులకు వెళ్లడం అవసరమా? ఈ కంపెనీ కాకపోతే.. ఇంకో కంపెనీ.. వర్క్ ఫ్రం హోం ఎవరిస్తే ఆ సంస్థకి జంప్ కొట్టేందుకు రెజ్యూమ్‌లు అప్‌లోడ్ చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. జాబులకు కొదవ లేదు. కాల్స్ బాగానే వస్తున్నాయి. దీంతో, వర్క్ ఫ్రం హోం ఇస్తేనే ఉంటామంటూ ఎంప్లాయిస్ బ్లాక్‌మెయిల్ చేయడం పెరిగింది. దీంతో, కంపెనీలు అయోమయంలో పడుతున్నాయి. ఇటు ప్రభుత్వాల నుంచి ప్రెజర్.. అటు ఉద్యోగుల నుంచి వర్క్ ఫ్రం హోం డిమాండ్.. ఏం చేయాలా అని సందిగ్థంలో పడ్డాయి సంస్థలు.రెండేళ్ల తరువాత ఐటీ కంపెనీలు ఆఫీసులను ఒపెన్ చేస్తోన్న నేపథ్యంలో.. ఉద్యోగులు అధిక శాతం వర్క్ ఫ్రం హోంకు సిద్దంగా ఉన్నట్లు రిక్రూట్‌మెంట్ అండ్ స్టాఫింగ్ సంస్థ CIEL HR సర్వీసెస్ నిర్వహించిన సర్వేలో తేలింది. సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వర్క్ ఫ్రం హోం ఎంతో సౌకర్యవంతంగా ఉందని.. ఒక వేళ ఐటీ కంపెనీలు ఆఫీసులకు రావాలనే నిబంధనను కచ్చితం చేస్తే.. ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు సర్వేలో పార్టిసిపేట్ చేసిన ఎంప్లాయిస్ తెలిపారు. ప్రతి 10మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు సర్వే రిపోర్ట్. ఐటీ, ఔట్ సోర్సింగ్, టెక్ స్టార్టప్స్,, కన్సల్టింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ వంటి అన్ని రంగాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే ఓటేశారు. వర్క్ ఫ్రం హోం ఇస్తే.. హైక్, ప్రమోషన్ కూడా అవసరం లేదని చెప్పారు. ఈ సర్వేలో 620 కంపెనీల నుంచి 2వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సర్వే డీటైల్స్ ఇప్పుడు ఐటీ కంపెనీలను షేక్