YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాలాజీ జిల్లాకే బ్రేక్

బాలాజీ జిల్లాకే బ్రేక్

తిరుపతి, మార్చి 24,
తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న బాలాజీ జిల్లాకుతాత్కాలికంగా బ్రేకుల పడ్డాయి. ఓ వైపు కలెక్టరేట్‌గా పద్మావతి నిలయం సిద్ధం అవుతుండగా.. హైకోర్టు ఇచ్చిన స్టేతో జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పద్మావతి నిలయాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు కేటాయించండపై హైకోర్టు స్టే విధించింది. భక్తుల విరాళాలతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించడంపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పద్మావతి నిలయంలో ఎలాంటి మార్పులు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.దీనిపై వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది. ప్రస్తుతం బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ కోసం పద్మావతి ఆలయం ముస్తాబవుతోంది. తాత్కాలిక కలెక్టరేట్‌తోపాటు రెండు ప్రభుత్వ శాఖల కోసం అందులో గదులను కూడా కేటాయించింది టీటీడీ.ఫర్నిచర్‌, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కూడా కేటాయించింది ప్రభుత్వం. అయితే.. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడంపై ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపారు బీజేపీ నేతలు. అయినా ప్రభుత్వం ముందుకు పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌ విచారించిన కోర్టు.. కలెక్టరేట్‌ పనులను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 29లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీకి సూచించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బాలాజీ జిల్లా కేంద్రం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Related Posts