YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

చక్కెర కోసం కొట్టుకుంటున్న రష్యన్లు

చక్కెర కోసం కొట్టుకుంటున్న రష్యన్లు

మాస్కో, మార్చి 24,
యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలే కాదు.. రష్యా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాడులతో రష్యా.. ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే రష్యా దూకుడుకు కల్లెం వేయడానికి పలు దేశాలు ఆంక్షలు పెట్టాయి. దాంతో రష్యాలో సరుకుల కొరత ఏర్పడుతుంది. చాలా దేశాలు ఆంక్షలు పేరుతో ర‌ష్యాకు దిగుమ‌తుల‌ను నిలిపివేశాయి. మరోవైపు దేశంలో ద్రవ్యోల్భణం కూడా ఏర్పడింది. దీంతో అక్కడ సరుకుల కొరత ఏర్పడుతుంది.దీంతో అక్కడ షాపులు వినియోగదారులకు ఎంత అంటే అంత ఇవ్వకుండా.. రేషన్ పద్ధతిలో సరుకులను అందిస్తున్నాయి. మరోవైపు రష్యాలో వార్షిక ద్రవ్యోల్బణం 2015 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సరుకుల కోసం అక్కడ ప్రజలు కటకటలాడుతున్నారు. ఎంతగా అంటే సరుకుల కోసం కొట్టుకుంటున్నారు. ఓ సూప‌ర్ మార్కెట్‌లో చక్కెర కోసం ర‌ష్య‌న్లు విచ‌క్ష‌ణార‌హితంగా కొట్లాడుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న షుగర్ ప్యాకెట్లను మరొకరు లాక్కున్నారు. అలా కొట్లాడుకుంటున్న ర‌ష్యన్‌ ప్రజల వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఆంక్షల కారణంగా రష్యాలో రకరకాల ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా కండోమ్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉందనే వార్త హల్‌‌చల్ చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున కండోమ్‌లను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. దీనివల్ల అక్కడ కండోమ్స్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. డూరెక్స్‌ బ్రాండ్‌తో కండోమ్స్‌ తయారు చేసే రెకిట్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది మార్చితో పోల్చితే మొదటి పదిహేను రోజుల్లోనే రష్యాలో కండోమ్‌ల అమ్మకాలు 170 శాతం పెరిగాయి. దీంతో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే.. అటు ఉక్రెయిన్‌తో పాటు.. రష్యా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Related Posts