YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోమటిరెడ్డి.. యూ టర్న్ తీసుకున్నారా

కోమటిరెడ్డి.. యూ టర్న్ తీసుకున్నారా

నల్గొండ, మార్చి 24,
అవును, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి చెప్పింది నిజం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలనేవి భార్యభర్తల  మధ్య తగువు లాంటివే, నిజమే. అలాగే భార్యాభర్తల తగవుల్లానే వాటంతట అవే సర్దుకుంటాయి,అంతే గానీ, అంత త్వరగా విడాకుల వరకు వెళ్ళవు. కోమటి రెడ్డి సోదరుల విషయమే తీసుకుంటే, రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే, అసమ్మతి గళం వినిపించిన మొదటి నాయకుడు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి. చివరి వరకు రేవంత్ రెడ్డితో పోటీపడి, చివరకు ఓటమి అంగీకరింకరించక తప్పని పరిస్థితిలో ఆయన ఇక గాంధీ భవన్ గడప తొక్కేది లేదని, ఆరోజునే  శపధం చేశారు. రేవంత్ రెడ్డి మీదనే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు, మాణిక్ ఠాగూర్’పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయినా, ఆ తర్వాత గాంధీ భవన్ గడప తొక్కారు, రేవంత్ రెడ్డితో కరచాలనం చేసుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తగువులాడుకున్నారు, మళ్ళీ ఈ రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి అపూర్వ సోదరుల్లా మీడియా  ముందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగానే కొమటి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు, భార్యాభర్తల తగువుల వంటివని చెప్పారు. అంతే కాకుండా, తాను చివరి వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నిజానికి కొద్ది రోజుల క్రితమే కోమటి రెడ్డి సోదరులు, బీజీపీలో చేరడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్లమెంట్’లో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. జస్ట్ ఒక అరగంటలోనే తనకు ప్రధాని అప్పాయింట్మెంట్ ఇవ్వడం అధ్బుతం, అమోఘం అంటూ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే, ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, నేరుగా సీఎల్పీలీడర్ భట్టి విక్రమార్క మీద  భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డి పైనా ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి విషయంలో  పార్టీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ను ఓడించేందుకు అవసరం అయితే దమ్మున్న పార్టీలో చేరతానని చెప్పారు. ఇంతలోనే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇలా ... మాటమార్చడం వెనక కారణం ఏమై ఉంటుంది?అంటే, అందుకు కోమటి రెడ్డి చెప్పిన భార్యాభర్తల పోలిక ఒక స్ట్రాంగ్ రీజనే అయినా, అసమ్మతి స్వరాన్ని పెంచిన సంగారెడ్డి ఎమ్మెల్ల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రెక్కలు కత్తిరింఛి ఆయన నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడంతో, కోమటి రెడ్డి ఒకడుగు వెనక్కి వేశారని అనుకోవచ్చని అంటున్నారు. అందుకే, కోమటి రెడ్డి తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతానని ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిశానని, భవిష్యత్తులోనూ ప్రధానిని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. ఉంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తి వివరాలతో ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. అంతే కాదు, బొగ్గు గనులలో జరిగిన కుంభకోణంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 134 మంది ఐఏఎస్‌లు ఖాళీగా ఉన్నారని, సీఎస్ దగ్గర 6-8 శాఖలు ఎందుకని ప్రశ్నించారు. ఏవైనా హై ఎండ్ బిల్డింగ్ ఫైల్స్ ఆమోదించాలంటే సీఎస్‌కు రూ.5 - రూ.10 కోట్లు ముట్టచెపితేనే పని అవుతోందని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. సీఎస్ సోమేష్ కుమార్‌ను ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో ఉన్నాయన్నారు. మొత్తానికి కోమటి రెడ్డి, ప్రధాని మోడీ మొదలు, ముఖ్యమంత్రి కేసీఆర్’ వరకు  వరకు, ఇటు పార్టీలో ప్రత్యర్ధుల వరకు అందరితోనూ శత్రుమిత్ర సంబంధాలను బాలన్స్ చేసుకుంటూ, సమయానుకూలంగా ఒపీనియన్స్’ మార్చుకుంటూ, స్మార్ట్ పోలిటిషియన్’గా నిరూపించుకుంటున్నారు

Related Posts