కోల్ కత్తా
తృణముల్ కాంగ్రెస్ అధికారంలో వున్నపశ్చిమ బెంగాల్లో హింసా రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీర్భూమ్ ఘటన జరిగి రెండు రోజులైనా కాకముందే తాజాగా మరో రెండు హింసాత్మక ఘటనలు జరిగాయి. అధికార తృణమూల్ పార్టీకి చెందిన నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలు రెండూ వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. నాదియా అనే గ్రామంలో తృణమూల్ నేత సహదేవ్ మండల్పై కాల్పులు జరిగాయి. దాంతో అయన అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఘటనలో హుగ్లీ తారకేశ్వర్ గ్రామంలో తృణమూల్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ రూపా సర్కార్ను కారుతో తొక్కి చంపే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
రెండు రోజుల క్రితమే బీర్భుమ్ జిల్లాలోని రాంపూర్హట్ శివారులోని బొగ్తూయ్ గ్రామంలో ఎనిమిది ఇండ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవ దహనమయ్యారు. ఘటనవెనుక రాజకీయ కారణాలని అనుమానిసత్ఉన్నారు. బర్షాల్ గ్రామంలో టీఎంసీ నేత భదు సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన కొద్ది గంటలకే అంటే మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఏడుగురి మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో ఉండగా, ఒకరు అసుపత్రిలో మరణించారు.