YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీలకు సిద్ధమౌతున్న అదిలాబాద్

పంచాయితీలకు సిద్ధమౌతున్న అదిలాబాద్

అదిలాబాద్ జిల్లాలో 467 పంచాయతీలకు 3882 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్‌ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది మండల అభివృద్ధి కార్యాలయ పర్యవేక్షకులు, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. జిల్లాలో సరిపడా బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు 1072 బాక్సులు ఉండగా ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు మహారాష్ట్ర నుంచి 5310 బాక్సులు తీసుకొచ్చారు. మొత్తం 6381 బాక్సులు జిల్లాలో ఉన్నాయి.  జిల్లాకు ఇవి సరిపోతాయి. మొత్తానికి ఎన్నికల కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది.ఈ ప్రక్రియ ఇంకా మొదలు కావల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి ఎన్నికల విధులకు ఇద్దరు ఉద్యోగులను వినియోగిస్తారు. వార్డుకు ఇద్దరు చొప్పున లెక్కిస్తే జిల్లావ్యాప్తంగా దాదాపు 7700 వరకు ఉద్యోగులు అవసరం. ఏదైన కారణాల రీత్యా విధులకు గైర్హాజరైతే 10 శాతం ఉద్యోగులు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు గడువులోగానే నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలం జులై నెలాఖరుతో ముగియనుండడంతో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త పంచాయతీలు పెరిగిన దృష్ట్యా ఈసారి మూడు విడతలుగానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఉద్యోగుల సంఖ్య లెక్కిస్తే దాదాపు 2800 వరకే ఉన్నట్లు చెబుతున్నారు. ఇంకా కొన్ని శాఖల నుంచి ఉద్యోగుల సంఖ్య సమాచారం రావాల్సి ఉండడంతో కొంతవరకు మాత్రమే పెరిగే అవకాశముంది. ఉద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించినా ఉద్యోగులు సరిపోరు. ప్రతిచోట కొత్త పంచాయతీలు పెరిగిన దృష్ట్యా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి. దీంతోనే మూడు విడతలుగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇంకా వీటికి సంబంధించి ఆదేశాలు రాకున్నా మూడు విడతల పోలింగ్‌ దాదాపు ఖరారైనట్లేనని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఒక్కో ఉద్యోగి రెండు మూడుసార్లు ఎన్నికల విధులు చేపట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది.  ఓటరు జాబితాలో తప్పుల సవరణ దాదాపు పూర్తికావొచ్చింది. 17వ తేదీన తుది ఓటరు జాబితాను పంచాయతీల వారిగా ప్రదర్శిస్తారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటర్లు, జనాభా లెక్కించి రిజర్వేషన్ల కోసం అంతా సిద్ధం చేస్తారు. 

Related Posts