గుడ్లవల్లేరు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు లో ఎన్టీఆర్ విగ్రహంను లారీ గుద్ది డేమేజ్ చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదవశాత్తు లారీ గుద్దడం వలన విగ్రహం విరిగి నది కానీ రాజకీయ కోణం ఏమీ లేదని పామర్రు సీఐ వెంకటరమణ స్పష్టం చేసారు. గురువారం తెల్లవారుజామున గుడ్లవల్లేరు గ్రామం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం డేమేజ్ అయిందని సమాచారం అందిన వెంటనే సిసి కెమెరాలు పరిశీలించి విగ్రహ డేమేజ్ కు కారణమైన ముద్దాయిని అదుపులోనికి తీసుకున్నన్నారు. ఘటన గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. వెంటనే గుడ్లవల్లేరు ఎస్ఐ ఏసోబు, సిబ్బంది కలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, సమీపంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి లారీ ను గుర్తించారు. లారీ ప్రమాదవశాత్తు, అనుకోకుండా విగ్రహాన్ని ఢీకొనడంతో విగ్రహం డేమేజ్ అయిందని గుర్తించారు,. లారీ వివరాలను సేకరించి, లారీ డ్రైవర్ అయిన అబ్దుల్ హఫీజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. _ఈ సంఘటన ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగింది. ఈ సంఘటన వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు.