రాజమహేంద్రవరం
జాతీయ రహదారిపై మద్యం మత్తులో బుధవారం రాత్రి యువకుల హల్ చల్ చేసారు. రాజమండ్రి - బొమ్మూరు హైవేపై వెళుతున్న కుటుంబంపై గంజాయి, మద్యం మత్తులో ముగ్గురు యువకుల దాడి జరిపారు. అటు వైపుగా వెళ్ళే కొంతమంది ఆగడంతో యువకులు పరారయ్యారు. స్థానికులు ఒక యువకుడికి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బొమ్మూరు పోలీసుల అదుపులో యువకుడు వుండగా ఇద్దరు యువకులు పరారీలో వున్నారు. నగర శివార్లలో సాధారణ ప్రజానీకం రాత్రులు బిక్కుబిక్కుమంటున్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ యువత చేష్టలతో రాత్రి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వారు, నగర శివారుల వైపు వెళ్లే వారు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా ఫలితాలు కనిపించడంలేదని అంటున్నారు.