YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దివ్యాంగుని ప్రతిభను చూసి భావోద్వేగానికి లోనయిన ప్రధాన మంత్రి మోదీ

దివ్యాంగుని ప్రతిభను చూసి భావోద్వేగానికి లోనయిన ప్రధాన మంత్రి మోదీ

న్యూఢిల్లీ  మార్చ్ 24
మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ దివ్యాంగుని ప్రతిభను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను కలిసి, మాట్లాడిన మధుర క్షణాలు ఎన్నటికీ మరపురాబోవని తెలిపారు. కాలి వేళ్ళతో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీస్తున్న ఆయన అందరికీ ప్రేరణనిస్తున్నారని, ఆయన నుంచి నిరంతరం ప్రేరణ పొందడానికే తాను ట్విటర్‌లో ఆయనను ఫాలో అవుతున్నానని చెప్పారు. ప్రధాని మోదీ గురువారం మధ్య ప్రదేశ్‌లోని బడ్‌వాహ్ నివాసి ఆయుష్ కుండల్‌ (24)ను కలిశారు. ఆయుష్ తన చేతులతో కనీసం చిన్న పని అయినా చేయలేరు. సక్రమంగా కూర్చోలేరు, మాట్లాడలేరు. అయినప్పటికీ ఆయన కాలి వేళ్ళకు అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఆయన మనోభావాలకు రూపమివ్వగలిగే సత్తా వాటికి ఉంది. మనసులో తలచుకున్న రూపాన్ని చిత్రంగా మలచగలిగే దమ్ము ఉంది. ఆయుష్ కుండల్ తన కాలి వేళ్ళతో దాదాపు 100కు పైగా పెయింటింగ్‌లను చిత్రించి, అందరి మన్ననలు పొందుతున్నారు. గతంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కలిసి, ఆయన ఆశీర్వాదాలు పొందారు. తాజాగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వీరిద్దరినీ కలవాలన్నది తమ కుమారుని చిరకాల కల అని ఆయుష్ తల్లిదండ్రులు సరోజ, పీయూష్ చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, తాను ఆయుష్ కుండల్‌ను కలిసిన క్షణాలు ఎన్నటికీ మరపురానివని తెలిపారు. ఆయుష్ పెయింటింగ్స్ వేయడంలో సాధించిన నైపుణ్యం, తన భావాలకు, ఊహలకు కాలి వేళ్ళ ద్వారా రూపమివ్వడం చాలా అద్భుతమని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన నుంచి నిరంతరం ప్రేరణ లభిస్తుందని, అందుకే తాను ట్విటర్‌లో ఆయనను ఫాలో అవుతున్నానని తెలిపారు.  ఆయన పెయింటింగ్స్‌ను చూడాలని అందరినీ కోరారు. ఆయన తన పెయింటింగ్స్ కోసం ఓ యూట్యూబ్ చానల్‌ను కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ చానల్‌లో ఆయన జీవితంలోని వేర్వేరు రంగుల సమాహారం ఉంటుందన్నారు. ఈ చానల్ లింక్‌ను కూడా ఆయన ఈ ట్వీట్‌లో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయుష్ కుండల్ తాను వేసిన వివేకానందుని పెయింటింగ్‌ను మోదీకి బహూకరించారు.

Related Posts