తిరుమల మార్చి 25,
దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీ కి రూ కోటి విరాళంగా అందించారు. తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడి అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము
ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.
గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం
టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ శుక్రవారం రూ.10, 01, 116 ( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమల లోని టీటీడీ చైర్మన్ క్యాపు కార్యాలయంలో ఈ మేరకు డిడిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.