YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

178 ఎకరాలలో కోహెడ పండ్ల మార్కెట్ మంత్రి నిరంజన్ రెడ్డి

178 ఎకరాలలో కోహెడ పండ్ల మార్కెట్ మంత్రి నిరంజన్ రెడ్డి

న్యూఢిల్లీ
కోహెడ మార్కెట్ నిర్మాణం నేపథ్యంలో ఢిల్లీ ఆజాద్ పూర్ మండీని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆజాద్ పూర్ మండి చైర్మన్ అదిల్ ఖాన్ అహ్వానించారు. ఈ   సందర్శనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో పండ్ల రైతులకు ప్రోత్సాహం అవసరం. మారుతున్న జీవనశైలి నేపథ్యంలో  పండ్ల ప్రాధాన్యం పెరిగింది .. ప్రజలు ఎక్కువగా పండ్లను వినియోగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి, భవిష్యత్ లో మరింత మారతాయి. దేశంలో అతి పెద్ద ఢిల్లీ ఆజాద్ పూర్ మండీ సందర్శన .. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం .. 1975 లో 90 ఎకరాలలో నిర్మాణం. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆజాద్ పూర్ మండిలో పండ్లు, కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానం పరిశీలన చేసాం. రైతులు, ట్రేడర్లు, అధికారులతో సమావేశం .. మార్కెట్ నిర్వహణపై చర్చ జరిపామని అన్నారు.
వ్యవసాయ పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా ఉద్యాన పంటల ప్రాధాన్యం, విలువ ఎక్కువ వుంటుంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతున్నదని మంత్రి అన్నారు.

Related Posts