న్యూ ఢిల్లీ (కీవ్) మార్చ్ 25
ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన రష్యాకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దాదాపు 60 శాతం రష్యా ప్రయోగించిన క్షిపణులు విఫలం అవుతున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఆ దేశం ప్రయోగించిన క్షిపణలు అత్యధిక సంఖ్యలో విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అమెరికా అధికారులు ఓ రిపోర్ట్ తయారు చేశారు. సరైన రీతిలో లాంచ్ చేసే సామర్థ్యం లేకపోవడమో లేక పేలే సమయంలో ఆ క్షిపణలు పేలకపోవడం జరుగుతుందని అనుమానిస్తున్నారు. 60 శాతం రష్యా మిస్సైళ్లు విఫలం అవుతున్నట్లు అమెరికా చెప్పినా.. దీనిపై క్లారిటీ లేదు. కానీ నెల రోజుల ఆక్రమణ వల్ల రష్యా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రష్యా సుమారు 1100 మిస్సైళ్లు ప్రయోగించినట్లు అమెరికా తన నివేదికలో చెప్పింది. దీంతో ఎన్ని టార్గెట్‌ను చేరుకున్నాయి, ఎన్ని విఫలం అయ్యాయో తెలియడం లేదు.