YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సామాజిక పెన్షన్ల మంజూరులో విప్లవాత్మక మార్పులు

సామాజిక పెన్షన్ల మంజూరులో విప్లవాత్మక మార్పులు

అమరావతి
నవరత్నాలు ద్వారా ఈ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హతే ప్రామాణికంగా అందరికీ చేరువ చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్  సంకల్పించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేని విధంగా సీఎం శ్రీ వైయస్ జగన్ సామాజిక ఫించన్ల అమలులో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వైద్య చికిత్స వల్ల జీవనోపాధి కోల్పోయినటువంటి వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి, వారు గౌరవ ప్రధమైన జీవితాన్ని పొందడానికి  “వైయస్ఆర్ పింఛను కానుక” పథకంను సంతృప్త స్థాయిలో ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.   గత ప్రభుత్వంలో ఎన్నికలకు 5 నెలల ముందు వరకు కేవలం రూ.1000 మాత్రమే పెన్షన్ కింద ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి అక్టోబర్ 2018 మధ్యన ఇచ్చిన ఫించన్లు 40 నుంచి 43 లక్షలు మాత్రమే. ఎన్నికలకు చివరి 6 నెలల్లో హడావుడిగా పెంచిన ఫించన్లు 9,00,003. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఫించన్ పై ఖర్చు చేసింది రూ.27,687 కోట్లు మాత్రమే. శ్రీ వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి సంతకం ఫించన్ వయోపరిమితి ని 65 నుంచి 60 కి తగ్గించడం పైనే. దీని ద్వారా 10.60 లక్షల మందికి ప్రయోజనం జరిగింది. అంతేకాకుండా ఫించన్ మొత్తాన్ని రూ.2,250/- కి పెంచడం, రెండో విడతగా జనవరి 2022 లో  దానిని రూ.2,500/- కి పెంచిన ఘనత కూడా సీఎం శ్రీ వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఈ ప్రభుత్వం సుమారు 61 లక్షల పైన ప్రతి నెలా ఫించన్లను పంపిణి చేస్తోంది. దీని పై ప్రతి నెలా రూ.1557 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 18.75 లక్షల కొత్త ఫించన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 33 నెలల కాలంలో ప్రభుత్వం ఫించన్లు పై రూ.47,646 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.68 లక్షల గ్రామ, వార్డ్ వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారి గడప వద్దనే పెన్షన్ మొత్తాలను వారి చేతికే అందిస్తున్నారు.
 పెన్షన్ల మంజూరులో అత్యంత పారదర్శకత:
గతంలో పెన్షన్ల మంజూరు జన్మభూమి కమిటీల చేతుల్లో ఉండేది. తెలుగుదేశం వారు ఎవరికి ఇవ్వమంటే వారికే పెన్షన్ వచ్చేది. ఈ పరిస్తితిని పూర్తిగా మారుస్తూ సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అర్హతే ప్రామాణికంగా పెన్షన్ల మంజూరు జరగాలని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. అత్యంత పారదర్శకతతో పెన్షన్ల మంజూరు చేస్తున్నారు. దరఖాస్తుదారు గ్రామ, వార్డు సెక్రటేరియట్లో దరఖాస్తు చేసుకుంటే, డిజిటల్ అసిస్టెంట్ ఆ దరఖాస్తును స్వీకరించి దాని వివరాలను GSWS పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. పింఛను అర్హత ప్రమాణం సిస్టమ్ ద్వారా ధృవీకరిస్తారు. ఆమోదించిన దరఖాస్తులు వెరిఫికేషన్ (WEA) కోసం సంక్షేమం & విద్య అసిస్టెంట్కి బదిలీ చేస్తారు. WEA ఫిజికల్ వెరిఫికేషన్ను చేపట్టి, గ్రామీణ ప్రాంతాల్లోని MPDOలకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు సమర్పించడం జరుగుతుంది. ఎండిఓ, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుదారుల వివరాలను పథకం మార్గదర్శకాలతో సరిచూసుకుని సదరు దరఖాస్తును మంజూరు చేయడం లేదా తిరస్కరించడం చేస్తారు. ఈ ప్రక్రియ 21 రోజుల్లో పూర్తవుతుంది. ఈమేరకు దరఖాస్తుదారులకు మంజూరు ఆర్డర్, పెన్షన్ కార్డులను అందజేయడం జరుగుతుంది. సెర్ప్ విభాగం పింఛను పథకాన్ని పర్యవేక్షిస్తుంది. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా దాదాపు 15,000 గ్రామ, వార్డు సచివాలయాలకు నిధులు విడుదల చేస్తే, పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సదరు నగదును డ్రా చేసి గ్రామ, వార్డు వాలంటీర్లకు అందజేస్తారు. వారి ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతోందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
ఫిబ్రవరి, 2022 న కార్పొరేషన్ వారీగా విడుదల చేసి  మార్చి 1న చెల్లించిన పెన్షన్ వివరాలు:
1 ఎస్.టి. కార్పోరేషన్, 359839 మందికి రూ. 91.03 కోట్లు
2 ఎస్.సి. కార్పోరేషన్, 1020892 మందికి రూ.261.75 కోట్లు
3 బి.సి. కార్పోరేషన్, 3013635 మందికి,  రూ.763.51
4 కాపు కార్పోరేషన్, 389782 మందికి  రూ.97.41
5 ఇ.బి.సి. కార్పోరేషన్, 1089484 మందికి రూ.279.12
6 మైనారిటీ కార్పోరేషన్,  228644 మందికి, రూ.58.44
7 బ్రాహ్మిన్ కార్పోరేషన్,  22952 మందికి  రూ.5.80
  మొత్తం 6125228 మందికి, రూ.1557.06 చెల్లించడం జరిగిందని మంత్రి వెల్లడించారు

Related Posts