YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్‌ను ఆదుకోవాల‌ని రాజ్య‌స‌భలో ఏడ్చిన ఎంపీ రూపా గంగూలీ

బెంగాల్‌ను ఆదుకోవాల‌ని రాజ్య‌స‌భలో ఏడ్చిన ఎంపీ రూపా గంగూలీ

న్యూఢిల్లీ మార్చ్ 25
బెంగాల్‌ను ఆదుకోవాల‌ని ఎంపీ రూపా గంగూలీ ఏడ్చేశారు. ఆ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రాజ్య‌స‌భలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవ‌ల బీర్బ‌మ్‌లో జ‌రిగిన హింస గురించి ఆమె జీరో అవ‌ర్‌లో ప్ర‌స్తావించారు. కేవ‌లం 8 మంది మాత్‌‌మే మ‌ర‌ణించార‌ని, అంత క‌న్నా ఎక్కువ లేద‌ని ఆమె బెంగాల్ ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. రూపా మాట్లాడుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీలు స‌భ‌లో ఆందోళ‌న సృష్టించారు.అటాప్సీ రిపోర్ట్ ప్ర‌కారం.. తొలుత అక్క‌డ వాళ్ల‌ను కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. కొట్టిన త‌ర్వాత సామూహిక హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు రూపా ఆరోపించారు. బెంగాల్‌ నుంచి జ‌నం పారిపోతున్నార‌ని గంగూలీ ఆరోపించారు. భార‌త్‌లో బెంగాల్ భాగ‌మ‌ని, అక్క‌డ జీవించే హ‌క్కు ఉంద‌ని, మేం బెంగాల్‌లో పుట్టామ‌ని, అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు అని, ద‌క్షిణేశ్వ‌ర్‌ మ‌హాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. ఆ స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. తృణ‌మూల్ ఎంపీలు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు.

Related Posts