YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాకినాడలో కిచిడి చేపలు

కాకినాడలో కిచిడి చేపలు

కాకినాడ, మార్చి 26,
వలలో పెద్ద చేప పడిందంటే మత్స్యకారులకు పండగే. చేప చిన్నదైనా పులస లాంటి కాస్ట్‌లీదైతే మరీ హ్యాపీస్‌. వీటితో పాటు తూర్పుగోదావరిలో భయపెట్టే డేంజరస్‌ చేపలూ దొరుకుతున్నాయి. చేపలందు ఈ చేపలు వేరయా అనిపించే వెరైటీ ఫిష్ చిక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వింత చేపలు, అందమైన చేపలు మత్స్యకారుల వలకు చిక్కితే సంబరపడతారు. వాటిని చూసేందుకు జనం కూడా ఎగబడతున్నారు.కచ్చిడి అనే ఓ రకం మగ చేపకు మహా డిమాండ్‌. మందుల తయారీలో వాడతారు. ఈ రకం చేపలు రెండు కాకినాడ, అంతర్వేది దగ్గర మత్స్యకారుల వలకు చిక్కాయి. సుమారు 30 కేజీల చేపలు ఒక్కోటి మూడు లక్షల వరకు ధర పలికాయి. మత్స్యకారుల పంట పండింది.అలాగే యానాంలో భారీ పండుగప్ప మత్స్యకారుల వలకు చిక్కింది. పండుగప్పలు మహా అయితే 3 నుంచి 4 కేజీల బరువు ఉంటాయి. కానీ యానాం పండుగప్ప మాత్రం 16 కిలోలపైనే ఉందట. లోకల్‌ మార్కెట్‌లో 8 వేల ధర పలికింది. దీన్ని ఏషియా సి బస్ అని కూడా పిలుస్తారు. గోదావరికి వరద వచ్చినప్పుడు దొరికే పులస చేపలకు చాలా డిమాండ్‌. ఆ టైమ్‌లో సముద్రం నుంచి ఎదురీది గోదావరికి వచ్చే ఇలసలు పులసలుగా మారతాయి. ఒక్కో పులస 3 వేల నుంచి 25 వేల ధర పలుకుతాయి.తాజాగా దొరికిన చేపలను చూసి మత్స్యకారులు భయపడుతున్నారు. అయ్య బాబోయ్‌ ఈ చేపలు ఎలా వచ్చాయంటూ గుండెలు బాదుకుంటున్నారు. నలుపు చారలు కలిగిన ఈ చేపలు పి.గన్నవరం మండలం మానేపల్లి పంట కాల్వలో దొరికాయి. వీటిని సక్కర్ ఫిష్ అంటారు. ఇవి పొరపాటున చెరువుల్లో చేరితే రైతులకు భారీ నష్టం తప్పదంట.కోనసీమలో మరో డేంజరస్‌ చేప కూడా ప్రత్యక్షమైంది. మనిషి ముఖాన్ని పోలినట్టు ఉండే చేపను చూస్తే వామ్మో అనాల్సిందే. ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపట. ఇది ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప వద్ద మత్స్యకారుల వలకు చిక్కింది. దీన్ని బొంక చేప అని పిలుస్తారు. మామూలు చేపలానే ఉంటుంది. ఎవరైనా తాకినా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. దీనిలో విషం మనిషిని చంపేంత ఉంటుందట.

Related Posts