YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మారుతున్న సత్తెనపల్లి రాజకీయాలు

మారుతున్న సత్తెనపల్లి రాజకీయాలు

గుంటూరు, మార్చి 26,
గుంటూరు జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గం సత్తెనపల్లి. 2014లో కోడెల శివప్రసాదరావు, 2019లో అంబటి రాంబాబు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో సత్తెనపల్లిలో టీడీపీ ఇరకాటంలో పడింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితి. కోడెల మరణంతో నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు కలగూరగంపలా తయారయ్యాయి. జిల్లాలో రాజకీయంగా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ సత్తెనపల్లి సీటు నాదంటే నాది అని కామెంట్ చేసుకోవడం కేడర్‌కు విసుగు పుట్టిస్తోందట. చేతిలో నాలుగు డబ్బులు ఉంటే చాలు రెండు కార్లు వేసుకుని తిరుగుతూ.. సత్తెనపల్లి సీటు నాకే ఫిక్స్‌ చేశారని చెప్పుకొంటున్నారు కొందరు నాయకులు. నాలుగురోజులు వాళ్లతో తిరుగుతున్న కేడర్‌ సైతం ఎటూ తేలని పంచాయితీ అని సైలెంట్‌ అయిపోతుందట.సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ను ఆశించే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, రాయపాటి రంగబాబు, కోడెల శివరాం, నాగోతు శౌరయ్య తదితరులు ఉన్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలోకి వైవీ తొంగి చూసింది లేదు. వైవీకి చెందిన విద్యాసంస్థల్లో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరిపారని.. ఒక దశలో పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ.. సత్తెనపల్లి టికెట్‌ రేసులో తాను ఉన్నానని చెబుతూ.. నియోజకవర్గ పరిధిలో జరిగే శుభకార్యాలకు పిలిచిందే తడవుగా వెళ్లిపోతున్నారు. ఆయన హడావిడి చూసి కేడర్‌ అవాక్కవుతోంది.మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు సైతం సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్నారు. 2019లోనే ఈ సీటు కోసం రాయపాటి విశ్వప్రయత్నం చేశారు. కానీ టికెట్‌ దక్కకపోవడంతో ఈ దఫా తప్పకుండా అవకాశం ఇస్తారని అనుకుంటున్నారట. ఈసారి సాంబశివరావు MPగా పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఆయన పోటీలో లేకుండా కొడుక్కి సత్తెనపల్లి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టే ఛాన్స్‌ ఉంది.టికెట్‌ ఆశిస్తున్న వారిలో మరో నేత కోడెల శివరాం. కోడెల శివప్రసాదరావు కుమారుడిగా సత్తెనపల్లిలో పోటీ చేసే హక్కు తనదే అని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన పనులే ఆయనకు ఇబ్బందిగా మారాయి. అవే ఇప్పుడు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. కోడెల వారసుడిగా శివరామ్‌కు లైన్‌ క్లియరయ్యి ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదు. ఆయన మీద ఉన్న ఆరోపణలను హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుని సీటు ఇవ్వదనే ప్రచారంతో చాలామంది క్యూ కడుతున్నారు.

Related Posts