ఇన్నాళ్లు వినియోగదారులకు ముచ్చమటలు పెట్టించిన ఉల్లి ఇప్పుడు రైతల కంట కన్నీరు తెప్పిస్తోంది...బహినంగ మార్కెట్ లో ఒక్క సారిగా ధరలు పడిపోయాయి..గిట్టు బాటు ధరలు లేక పోవిడంతో ఉల్లి పంటలు వేసిన రాయలసీమ ప్రాంతలోని రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు..దీనికి తోడు అకాల వర్షాలు కూడా రైతులను మరింత నష్టాలపాలు కలిగిస్తోంది...బహిరంగ మార్కెట్ లో ఉల్లి ధరలు అమాంతంగా పడిపోయాయి... ఆకాశన్నంటిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారు..మొన్నటి దాకా బహిరంగ మార్కెట్ లో కిలో యాభై కి అటుఇటుగా ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి..ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధరలు పది రూపాలయలు పలుకుతోంది..ఇక హోల్ సేల్ మార్కెట్ లో నాణ్యత ఉన్న ఉల్లి ధరలు ఐదారు రూపాలయకు మించి పలక పోవడంతో ఉల్లి రైతులకు దిక్కుతోచడం లేదు..ఎకరాకు లక్షల్లో పెట్టుబడులు పెట్టి తీరా మార్కెట్ లోకి వెళ్తే పెట్టుబడులు కూడా అందడం లేని పరిస్థితులు నెలకొన్నాయి.. గత మూడేళ్లుగా ఉల్లి పంటలపై లాభాలు చవిచూస్తున్న రైతన్నలకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.. రాష్ట్రంలో ఉల్లి పంటను కర్నూలు జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తారు..రాయలసీమలోని చిత్తూరు..కడప..అనంతపూర్ జి్ల్లాలో కూడా ఉల్లిని సాగు చేస్తారు..ఉల్లికి కర్నూలు మార్కెట్ పెట్టింది పేరు... ఈ జిల్లాలో వేలాది ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తుంటారు. గత ఆగష్టు నెలలో క్వింటా ఉల్లి మూడు వేలు నుంచి నాలుగు వేలకు పైగా దాకా పలికింది..ప్రస్తుతం ఉల్లి ధరలు కిందకు దిగుతూనే ఉన్నాయి.. నెల రోజుల కిందట క్వింటా ఉల్లి ధర 1200 ఉండగా ప్రస్తుతం నాలుగు వందలకు పడిపోయింది...ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు.. అయితే ప్రస్తుతం ఉల్లి పంట అధిక దిగుబడి ఉండటంతోనే ధరలు పతనమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు..కర్నూలు మార్కెట్ కు ఒక్క రోజులో 30 వేల టన్నలు వస్తుందంటే దిగుబడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..అయితే ఇదంతా ధళారుల మాయాజాలం అని రైతులు ఆరోపిస్తుస్తున్నారు..గిట్టుబాటు దరలు కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు,,,, రైతుల నుంచి నాలగైదు రూపాయలకు కొంటుంటే బహిరంగ మార్కెట్ లో పది రూపాయలకు విక్రయిస్తున్నారు..టమోట సాగుతో నష్టాలు వస్తున్నాయని భావించిన చిత్తూరు జిల్లా రైతలు చాలా మంది ఇటీవల కాలంలో ఉల్లి పంటను నమ్ముకున్నారు..గత మూడేళ్లుగా లాభాలు తెచ్చిన పంట ధరలు పతనం అవడంతో అన్నదాతలకు కన్నీళ్లనే మిగులిస్తోంది...చిత్తూరు జిల్లాలోని కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా క్యారెట్..బీట్ రూట్ వంటి పంటలు సాగు చేస్తుంటారు..అయితే కర్నాటక ప్రాంత వ్యాపారులు ఉల్లి కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఇక్కడి రైతులు ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేస్తున్నారు..ఎకరాకు డెభ్బై వేల నుంచి లక్ష దాకా ఆదాయం చూసారు..ఇప్పుడు కిలో ఉల్లి మార్కెట్ లో నాలుగైదు రూపాయలకు పడిపొవడంతో కూలీలు కూడా గిట్టుబాటు కాక పంటను పోలంలోనే వదిలి వేసే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...ఒక వైపు మార్కెట్ లో ఉల్లి ధరలు నేలను తాకి నష్టపోతున్న రైతులకు మాలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా అకాల వర్షాలు పడుతుండటంతో చేతి కొచ్చిన పంటలు నీటమునిగి పోతుండటంతో కన్నీటి పర్యంతమవుతున్నారు...