YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బెర్త్ కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం

బెర్త్ కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం

విజయవాడ, మార్చి 26,
త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చి చెప్పేయటంతో బెర్త్ కోసం కొందరు, ఎర్త్ పడకుండా మరి కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కోర్ట్ టీమ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.వైసీపీలో మంత్రి పోస్ట్ కోసం లాబీయింగ్ పతాకస్థాయికి చేరింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే పదవీకాలం రెండున్నర ఏళ్లు అని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చేప్పేశారు. మంత్రివర్గాన్ని దాదాపుగా పునర్వ్యస్థీకరించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. అధినేత చెప్పిన సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్నవాళ్లలో కొందరు ఇంటికి వెళ్లక తప్పదు.కొన్ని సమీకరణల వల్ల ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పటంతో మరింత ఉత్కంఠ పెరుగుతుంది. ఆ మినహాయింపులో కేబినెట్‌ బెర్త్‌ను కాపాడుకునేందుకు కొందరు మంత్రులు ప్రయాసలు పడుతున్నట్టు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి కోర్‌ టీమ్‌ సభ్యుల గుడ్‌లుక్స్ కోసం తెగ శ్రమిస్తున్నారట. వీరితోపాటు కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కోర్‌ టీమ్‌ సభ్యుల ఆఫీసులకు క్యూ కడుతున్నారు.ఉగాది నాటికి జిల్లాల విభజన అధికారికంగా జరగనుండటంతో మంత్రివర్గ కూర్పులో ఆ సమీకరణాలు కూడా కీలంగా మారబోతున్నాయి. ఈ తూకంలో నిలిచేది ఎవరు.. గెలిచేది ఎవరు అన్నదే ప్రశ్న. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏదో రకంగా సీఎం దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు.. మంచి మార్కులు కొట్టి పదవి పదిలం చేసుకునేందుకు కొందరు మంత్రులు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమాత్యులు తమను కేబినెట్‌లో కొనసాగించాలని పార్టీ ముఖ్య నేతలను నేరుగానే అడిగేస్తున్నారట.ప్రస్తుతం ఈ విజ్ఞప్తులు.. ఎమ్మెల్యేల ఫీట్లు పార్టీలో చర్చగా మారాయి. ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వీటిపైనే చర్చ. మరి.. అధికారపార్టీలో ఈ విన్నపాలు ఎంతవరకు వర్కవుట్‌ అవుతాయో.. ఎవరి ఆశలను నెరవేరతాయో చూడాలి. సీఎం జగన్‌ ఫ్రేమ్‌లో పట్టేదెవరో కూడా వేచి చూడాల్సిందే.

Related Posts