YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భోపాల్ లో వింత ప్రేమ కధ

భోపాల్ లో వింత ప్రేమ కధ

భోపాల్, మార్చి 26,
వేర్వేరు కులాల వారు... వేర్వేరు మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం చూశాం. ఆఖరికి ఒకే లింగానికి చెందిన వారు, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చూశాం. అలాంటి వారు.. వారి వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి కోర్టులను ఆశ్రయించిన ఘటనలు ఉన్నాయి. వీటికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లో ఓ వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. పైగా వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి కాదు.. తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. మొరెనా జిల్లాలో ఓ 28 ఏళ్ల యువకుడు, 67 ఏళ్ల మహిళ ప్రేమించుకున్నారు. నిజానికి ఇద్దరికి రెండు జనరేషన్‌ల గ్యాప్ ఉంది. అయినా వారి మధ్య ప్రేమ చిగురించింది. కైలారస్ ప్రాంతంలో ఉండే యువకుడు భోలుగా, మహిళ రాంకలి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. కానీ వారికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దాంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే వారి సహజీవనాన్ని ధ్రువీకరించుకోవడానికి ఇద్దరు కోర్టుకు వెళ్లారు. వారి లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ను డాక్యుమెంట్ నోటరీ చేయించుకోవడానికి గ్వాలియర్ జిల్లా కోర్టుకు కలసి వెళ్లారు. భవిష్యత్తులో తమ సంబంధంపై ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు నోటరీ చేయించుకుంటున్నామని వారిద్దరు చెప్పారు. అయితే ఇటువంటి జంటలు వివాదాలు రాకుండా ముందుస్తుగా నోటరీ చేయించుకుంటారని, కానీ అలాంటి పత్రాలు చట్టపరమైన రూపంలో చెల్లుబాటు కావని స్థానిక న్యాయవాది అవస్తి చెప్పారు.

Related Posts