YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పిడుగులు పడే చోట ముందుగా సైరన్

 పిడుగులు పడే చోట ముందుగా సైరన్

పిడుగుపాటు నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా అన్ని పంచాయతీల్లో సైరన్లు ఏర్పాటు చేయనున్నారు. పిడుగులు పడే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికగా సైరన్లు మోగించనున్నారు. సమాచార గోప్యత, రక్షణ అత్యంత కీలకమని అధికారులను ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో సైరన్లు మోగించే విధానాన్ని ఇప్పటికే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పిడుగుపాటు మరణాలను వీలైనంత వరకూ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు వద్ద పిడుగు నిరోధక సాధనాలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఈ-హైవే, ఈ-ప్రగతి పోర్టల్, యాప్ స్టోర్ తదితర ఐదు అంశాలతో ఈ-ప్రగతి కోర్ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్య, ప్రాథమిక రంగం, రహదారులు, భవనాలు, పంచాయితీరాజ్, పరిశ్రమలు, పురాపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో ఈ-ప్రగతి అమలుపై ఆరా తీశారు. ఆయా శాఖలు ఏర్పాటు చేసుకున్న సమయానికే ఈ లక్ష్యాలు నెరవేరతాయని అధికారులు తెలిపారు. నందన్ నీలేకనీ కమిటీ 2012 రిపోర్టు ఆధారంగా ఈ-ప్రగతి మానవ వనరుల విధానం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు సీఎం తెలిపారు. ప్రజాసాధికార సర్వే అనుసంధానంతో అనేక కార్యక్రమాలు ఈ-ప్రగతి ద్వారా జరుగుతున్నాయని, డేటా పంచుకోవడం, భద్రత, తదితర అంశాలపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్‌సీబీఎన్ యాప్‌ను ఇప్పటివరకూ 10వేల మంది ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్నారని సీఎంకు తెలిపారు.

Related Posts