YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొలిక్కిరాని ధాన్యం పంచాయితీ

కొలిక్కిరాని ధాన్యం పంచాయితీ

హైదరాబాద్, మార్చి 26,
హర్యానా, పంజాబ్‌ల తరహాలోనే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌ను ఇటీవల తెరపైకి తెచ్చింది చేయాలనే డిమాండ్‌ను తెరపైకి కేసీఆర్‌ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ… భేటీకి ముందే… కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాని కొనలేమన్నారు. డిమాండ్-సరఫరా ఆధారంగానే అదనంగా ఉన్న ఉత్పత్తుల కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దేశంలోని ఆహార పదార్థాల అవసరాలతో పాటు ఇతర అంశాలను ఆధారంగానే కొనుగోళ్లు ఉంటాయంటోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు… ఇదే అంశంపై పార్లమెంట్‌లో ఆందోళన చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో యాసంగి పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు.ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలని ప్రధానిని కోరారాయన. లేదంటే వరికి కనీస మద్ధతు ధరకు అర్ధం ఉండదన్నారు కేసీఆర్.. తెలంగాణలో పండిన వరిని కేంద్రం కొనకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. ఆహార భద్రత లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అన్నారాయన. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని.. పత్తి, పామాయిల్, రెడ్‌గ్రామ్ వేయాలని కోరామని లేఖలో వివరించారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు సీఎం. అయితే, ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ నుంచి వరిని కొనుగోలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు కేసీఆర్. పరిస్థితి చూస్తుంటే… ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయమని కోరుతున్నామని… దేశ మంతా ఒకే విధానం ఎందుకు అమలు చేయడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత వరకైనా పోరాడుతాం అంటున్నారు టీఆర్ఎస్‌ నాయకులు.

Related Posts