YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

తగ్గిన టీబీ టెస్టులు

తగ్గిన టీబీ టెస్టులు

హైదరాబాద్, మార్చి 26,
దేశంలో టీబీ కేసుల సంఖ్య తగ్గినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) తాజా రిపోర్టులో వెల్లడించింది. కరోనా, లాక్డౌన్లతో ఎప్పటికప్పుడు టెస్టులు జరగకపోవడంతో 2020 లో కేసుల సంఖ్య 25 శాతం తగ్గిందని తెలిపింది. కిందటేడాది లాక్డౌన్, కరోనా వైరస్ కారణంగా 14 లక్షల మంది టీబీ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందక చనిపోయారని పేర్కొంది. సిగరెట్, బీడీ, తంబాకు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు వాడటం వల్లే అనేక మంది క్షయ(టీబీ) బారిన పడుతున్నారని రిపోర్టు తెలిపింది. పొగాకు నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దేశాలకు సూచించింది.దేశవ్యాప్తంగా 2019లో 24.04 లక్షల కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో 2017లో 44,644  టీబీ కేసులున్నట్లు గుర్తించగా.. 2018లో 52,269 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.  2019లో 70,202 టీబీ కేసులతో దేశంలోనే మన రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. 2020లో కొంత మేర కేసుల సంఖ్య తగ్గి 62,342 గా రికార్డయింది. రాష్ట్రంలో కిందటేడాది హైదరాబాద్ జిల్లాలో అత్యంత ఎక్కువగా 10,564 కేసులు నమోదు కాగా.. తక్కువగా 575 టీబీ కేసులు ములుగు జిల్లాలో నమోదయినట్లు డబ్ల్యూహెచ్వో రిపోర్టు వెల్లడించింది. మరోవైపు 2025 నాటికి దేశంలో టీబీ మరణాలు జీరోకు తేవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది.రాష్ట్ర సర్కార్ఎప్పటికప్పుడు టీబీ కేసుల నమోదు వివరాలు కేంద్రానికి వెల్లడించకపోవడం వల్లే బాధితులకు కేంద్రం ఇచ్చే నెలకు రూ. 500 సాయం అందట్లేదని పలువురు మండిపడుతున్నారు. కరోనా, లాక్డౌన్ కారణంగా కిందటేడాదిలో టెస్టుల సంఖ్య తగ్గిందని, సిబ్బంది నుంచి డేటా సరిగా రాకపోవడంతో టీబీ పేషెంట్ల వివరాలు నమోదు కాలేదని ఆఫీసర్లు అంటున్నారు. గతేడాది రాష్ట్రంలో నమోదైన టీబీ రోగుల్లో 46 వేల మంది వివరాలను మాత్రమే సేకరించామని చెప్పారు. అందులో 29,560 మందికే కేంద్రం ఇచ్చే సాయం అందినట్లు వెల్లడించారు. 2019లో  తెలంగాణలో టీబీతో 2 వేల మంది, 2018లో 1,800 మంది, 2020లో 2 వేలు దాటాయని తెలిపారు.

Related Posts