YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోదావరి ఒడిలో వరుస ప్రమాదాలు

 గోదావరి ఒడిలో వరుస ప్రమాదాలు

గోదావరి నదిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో బోట్లు,లాంచీల యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా ప్రయాణీకులను దోచుకుంటున్నారు. ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. ముఖ్యంగా దేవీపట్నంలో తరచూ తనిఖీ చేయాల్సి ఉండగా ఇటు రెవెన్యూ అధికారులు గాని,అటు పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడంతో బోటు వ్యాపారానికి హద్దులు, నియమాలు లేకుండాపోయాయి. దీంతో గోదావరి లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బోటు సూపరింటెండెంట్, ఉన్నతాధికారులు  లాంచీలు, బోట్లని తనిఖీ చేయకుండానే అనుమతించడంతో నెలకు సుమారు  రెండు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రాణనష్టం,ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.  ఆదేకోవలో మంగళ వారం సాయంత్రం కొండమొదలు నుంచి పెళ్ళి బృందంతో రాజమండ్రి వస్తున్న లాంచి మంటూరు వద్ద ప్రమాదానికి గురయింది. పోలవరానికి చెందిన ఖాజావలికి  సంబందించిన లాంచీ ఈ లాంచీ పేరు సుర్య ప్రకాష్. ఈ ఘటనలో దాదాపు 40మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ లాంచీ  ప్రతిరోజూ దేవిపట్నం నుండి కొండమొదలు ప్రయాణికులను చేరవేస్తుంది. గల్లంతైన వారంతా గిరిజనులే. ఘటన తరువాత  లాంచీ యజమాని ఖాజావల్లి దేవిపట్నం పోలీస్ స్టేషన్లో లొంగుయాడు.

Related Posts