ఈనెల 27న బద్వేల్ లో ప్రపంచ రంగస్థల దినోత్సవము ను ఘనంగా జరపనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష పధక అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి యువతరానికి మరియు సమాజానికి సంగీతము, సాహిత్యము,పాటలు , పద్యాలు లాంటి సందేశాత్మకమైన సమాచారాన్ని చేరవేయటానికి మరియు వ్యక్తుల యొక్క మనస్తత్వం మరియు వ్యక్తిత్వం మంచిగా మారాలన్నా మరియు సమాజంలో నేరచరిత్ర తగ్గాలన్నా ఇలాంటి వాటిపై మక్కువ పెంచడం మరియు ఆసక్తి పెంచడం అదేవిధంగా నైపుణ్యం గల కళాకారులను గుర్తించడం మరియు వారిని అభినందించడం ఎంతో అవసరమని గుర్తించి సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని బద్వేల్ పట్టణంలో మైదుకూర్ రోడ్ లో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప జిల్లా అదనపు ఎస్పీ మహేష్ కుమార్, మరియు స్టెప్ సీఈవో డాక్టర్ రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి డాక్టర్ వెంకట సుబ్బయ్య, మైదుకూరు డిఎస్పి , బద్వేల్ సిఐ,ఎస్ఐ, సినీ పరిశ్రమకు చెందిన ఆర్టిస్టులు, వివిధ రంగాలలో నైపుణ్యం గల కళాకారులు తదితరులు హాజరవుతున్నట్లు పిఓ డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.