YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విడుదల రజనీకి ఇంటి పోరు

విడుదల రజనీకి ఇంటి పోరు

గుంటూరు, మార్చి 28,
రాజకీయం అంటే.. చాలా చేయాలి.. అందుకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.. దానికి తోడు పార్టీ అధినేత ద‌గ్గ‌ర‌ భజన చేయాలి... చేసి తీరాలి.. అలా అయితేనే.. ఎన్నికల్లో గెలుస్తామో లేదో తర్వాత.. ముందు ఎమ్మెల్యే టికెట్ వస్తుందీ.  కానీ ఇవేమీ లేకుండా.. పార్టీలో ఇలా అడుగు పెట్టి.. అలా ఎమ్మెల్యే టికెట్టు తీసుకుని.. ఎన్నికల్లో గెలిచి.. ఆ వెంటనే అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అన్నారంటే .. వారికి చాలా లక్క్ ఉండి ఉండాలి. తాజాగా ఆ కోవలోకే వస్తోంది విడదల రజినీ. గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి.. ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారీ రజినీ. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కూడా ఆమెకు ఏ కోశానా లేదు. అలాగే ఆమెకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ కూడా లేకుండా.. కానీ ఇలా వచ్చి.. అలా దూసుకోపోతోందీ విడదల రజినీ. ఇంతకీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఆమె పొలిటికల్ ఎంట్రీ అసలు ఎలా జరిగిందంటూ ఆమె ఫ్యాన్స్  గూగుల్‌ తల్లిని జల్లెడ పడుతోంది.  1990, జూన్ 24న గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తపట్నంలో విడదల రజినీ జన్మించారు. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత అంటే 2011లో సికింద్రాబాద్‌ మల్కాజ్‌గిరిలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదవి గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. అనంతరం కర్ణాటకలోని చిత్రదుర్గంలో జేయంఐటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీఈ పట్టా అందుకున్నారు.  ఆ తర్వాత యూఎస్‌లో ఓ ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేరి.. తన పనితనంతో ఆమె అందరి మొప్పు పొందారు. ఆ తర్వాత అక్కడే ప్రొసెస్ వేయివర్ అనే సాఫ్ట్‌వేర్ బిజినెస్ పెట్టి.. ఆ వ్యాపారాన్ని సైతం లాభాల బాట పట్టించి.. వ్యాపార రంగంలో కూడా విడదల రజినీ రాణించారు. యూఎస్‌లో జాబ్ చేస్తున్నప్పుడే... కుమార స్వామితో ఆమెకు వివాహం అయింది. ఆయన కూడా యూఎస్‌లో పేరు పొందిన పారిశ్రామిక వేత్తే. అయితే 2014 ఎన్నికల్లో కొంత మంది యూఎస్‌లోని పారిశ్రామిక వేత్తలు.. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో.. ఆంధ్రపద్రశ్ రాష్ట్రానికి వచ్చి.. ఆ పార్టీ ప్రచార పనుల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అలా వచ్చిన వారిలో విడదల రజినీ కూడా ఒకరు. టీడీపీ ప్రచార పనుల్లో చురుగ్గా పాల్గొని.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి తన వంతు తోడ్పాటునందించారీ విడదల రజినీ.  2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో విడదల రజినీ.. సైకిల్ పార్టీలో చేరి.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమెకు జీవితంలో ఉండే కష్టనష్టాల గురించి తెలుసు. ఈ నేపథ్యంలో విడదల రజినీ.. వీఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్‌ను ప్రారంభించి.. ప్రజా సేవకు తన వంతు సహాయ సహాకారాలు  అందించారు. అలా వీఆర్ ట్రస్ట్ ద్వారా.. పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. చిలకలూరిపేట ప్రజలల్లో కలిసిపోయారీ రజినీ. అంతేకాదు.. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సత్తాతోపాటు మంచి వాక్చాతుర్యం ఉన్నా.. ఈ విడదల రజినీ టాలెంట్‌ను ప్రత్తిపాటి పుల్లారావు గుర్తించారు. ఆ క్రమంలో విశాఖపట్నం వేదికగా జరుగుతోన్న మహానాడులో.. చంద్రబాబుతో మాట్లాడి మరీ విడదల రజినీకి అవకాశం ఇప్పించారీ ప్రత్తిపాటి పుల్లారావు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడదల రజినీ అదరగొట్టింది. హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్క అంటూ రజినీ.. తన మాటల గారడీతో.. చంద్రబాబునే కాదు.. పసుపు పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరినీ మాయ చేసేసింది. ఇదే సభ వేదికపై నుంచి నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిలు నరకాసురులు అంటూ అభివర్ణించిందీ విడదల రజినీ. దీంతో సభలో వేదికపైన ఉన్న పెద్దలతోపాటు ఈ సభకు వచ్చిన కార్యకర్తల సైతం కొట్టిన చప్పట్లతో మహానాడు మారు మోగిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అలాగే విడదల రజినీ మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి. దీంతో రజినీ.. ఒక్కసారిగా తెలుగింట పాపులర్ అయిపోయారు. పవర్ ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్.. పవర్ ఫుల్ ప్లేసెస్ అని రజినీకి ఆ వేదికగా బాగా అర్థమైందీ. అందుకే తన రాజకీయ ప్రస్థానానికి కారణమైన.. పుల్లారావు సీటు కోసం.. రజినీ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీలో ప్రత్తిపాటి పుల్లారావు సీనియర్.. అంతేకాదు.. చంద్రబాబు కేబినెట్‌లో ఆయన మంత్రి కూడా. ఈ నేపథ్యంలో ఆయనకే చిలకలూరి పేట సీటు అంటూ టీడీపీ అధిష్టానం క్లియర్ కట్‌గా చెప్పేసింది. మరోవైపు.. టీడీపీకి భవిష్యత్తు లేదని రజినీకి బాగా అర్థమైందీ. ఆ క్రమంలో పాదయాత్ర చేస్తూ.. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతోన్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ విజయవాడకు చేరుకున్నారు. ఆయన సమక్షంలో విడుదల రజినీ.. జగన్ పార్టీ కండువా కుప్పుకొని.. ఫ్యాన్ కిందకు చేరి పోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్‌ను రంగంలోకి దింపాలని జగన్ భావించారు. కానీ అప్పుటికప్పుడు తన రాజకీయ చాణక్యానికి రజనీ పదును పెట్టి మరీ.. తనకు అనుకూలంగా పరిస్థితులను అప్పటికప్పుడు మార్చేసుకున్నారనే టాక్ అయితే నేటికి సదరు నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వ్యవహారంలో సీనియర్ నేత మర్రి రాజశేఖర్... అలకబూనడం.. దీంతో ఈ పంచాయతీ కాస్తా..  నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలు వద్దకు చేరడం... దాంతో ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అంటూ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఫ్యాన్ పార్టీలోని సదరు అగ్రనేతలంతా నాడు చేతిలో ఓట్టేసి మరీ చెప్పాడంతో.. అలకవీడిన మర్రి రాజశేఖర్.. తన సూచనలు, సలహాలతో రజినీని గెలుపు బాట పట్టించడమే కాదు.. ఆమెను బంపర్ మెజార్టీతో గెలుపెంచారు. ఎమ్మెల్యే అయిన తర్వాత.. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కామన్‌మెన్ లీడర్‌గా పేరు సంపాదించిందీ విడదల రజినీ.. తన సేవా కార్యక్రమాలతో.. తన రాజకీయ జీవితానికి కారణమైనా.. ప్రత్తిపాటి పుల్లారావుకు ఓటమి రుచి చూపించింది. అప్పటికే 2009, 2014 ఎన్నికల్లో వరస గెలుపును చూసిన పుల్లారావు.. హాట్రిక్ కొట్టేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. కానీ విడదల రజినీ గెలుపుతో ఆయన హ్యాట్రిక్ గెలుపుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే 2014లో మర్రి రాజశేఖర్ మీద.. ప్రత్తిపాటి పుల్లారావు గెలుపొందారు. అలాంటి నాయకుడిపై 8 వేల ఓట్ల అధిక్యంతో రజినీ విజయం సాధించారు. ఎన్నికల్లో గెలుపు కోసం .. డబ్బులు పంచితే సరిపోదని. ప్రజల తోడు కూడా ఉండాలని నిరూపించిందీ రజినీ. బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవరత్నాలు, టీడీపీపై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని.. ఇంకా బలంగా తీసుకు వెళ్లి.. తన గెలుపునకు బాటలు వేసుకోవడంలో రజినీ 100 శాతం సఫలీకృతులయ్యారు. దీంతో పాటు రజినీ గెలుపునకు సోషల్ మీడియా కూడా తన వంతు సహాయ సహాకారాలు అందించింది. మరోవైపు పోల్ బూత్ మేనేజ్‌మెంట్ మీద రజినీ మంచి పట్టు సంపాందించింది. అంతేకాకుండా వీఆర్ ఫౌండేషన్ పేరుతో గ్రామాల్లో మంచి నీరు సరఫరా సౌకర్యం కల్పించడంతోపాటు మౌలిక సదుపాయాలను సైతం అందేలా రజినీ చర్యలు తీసుకొంది. దీంతో అందరి నోట రజినీ.. రజినీ పేరు వినబడేలా చేసుకొంది. అదీకాక చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి బీసీ మహిళా ఎమ్మెల్యేగా విడదల రజినీ చరిత్ర సృష్టించింది. సేవా కార్యక్రమాల్లో రజినీ చురుగ్గా ఉండడం వల్లే బీసీ సంక్షేమ సంఘంలో ఆమె ముఖ్య నాయకురాలిగా ఎదిగారు. ఇప్పటికీ తాను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి కోసం విడదల రజినీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.

Related Posts