YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వడివడిగా రైల్వే జోన్ అడుగులు

వడివడిగా రైల్వే జోన్ అడుగులు

విశాఖపట్టణం, మార్చి  28,
విశాఖపట్నం రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. డీపీఆర్‌పై సూచనలు, సలహాల పరిశీలనకు కమిటీని నియమించినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. విభజన హామీల్లో ప్రధానమైన విశాఖ రైల్వే జోన్ అంశంపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి. వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అశ్వినీ వైష్ణవ్. అటు వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు, రైల్వే శాఖమంత్రి. విశాఖ రైల్వే జోన్ డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు.విశాఖ రైల్వే జోన్‌తో పాటు రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21 బడ్జెట్‌లో 170 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు అశ్వినీ వైష్ణవ్. రైల్వే జోన్, రైల్వే డివిజన్ పరిధితో పాటు ఇతర అంశాలు కూడా తమ దృష్టకి వచ్చాయని చెప్పారు. వాటి పరిశీలనకు అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కేంద్రమంత్రి. అయితే, ఇది కొత్తదేం కాదని, దీనికి సంబంధించిన డీపీఆర్‌ను రెండేళ్ల క్రితమే ఇచ్చామని చెబుతున్నారు, విశాఖ రైల్వే జోన్‌ సాధన సమితి కన్వీనర్‌ సత్యనారాయణ మూర్తిఅటు ఇతర ప్రాజెక్టులపైనా క్లారిటీ ఇచ్చింది కేంద్రం. కడప-బెంగుళూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి, ఏపీ ప్రభుత్వం తన వాటా డిపాజిట్‌ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును నిలిపివేసినట్లు చెప్పారు రైల్వేమంత్రి. కర్నూలు కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాప్‌ కేటాయింపులను, 560.72 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు అశ్వినీ వైష్ణవ్. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు 178.35 కోట్లు కేటాయించగా, 171.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వివరించారు కేంద్రమంత్రి.

Related Posts