YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలంలో ఆ నేతల సంగతేంటీ

కమలంలో ఆ నేతల సంగతేంటీ

హైదరాబాద్, మార్చి 28,
తెలంగాణ బీజేపీలో త్వరలో కొందరిపై వేటు పడబోతుందా? తూతూ మంత్రంగా పనిచేస్తున్న వారికి షాక్‌ తప్పదా? బండి సంజయ్‌ ఎవరిపై కన్నెర్ర చేశారు? ఆయన హెచ్చరికలు వర్కవుట్ అవుతున్నాయా.. లేదా?తెలంగాణలో ప్రత్యమ్నాయశక్తిగా పొలిటికల్‌ తెరపైకి రావాలని చూస్తోన్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. పోలింగ్ బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పనితీరును సమీక్షిస్తోందట. అనుబంధ సంఘాలు.. పార్టీ కార్యక్రమాలు.. జిల్లాల్లో సొంతంగా చేపట్టిన పొలిటికల్‌ ప్రోగ్రామ్స్‌పై ఆరా తీస్తున్నట్టు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఒకటి రెండు మోర్చాల పని తీరుపై అసంతృప్తి వ్యక్తమైందట. పలువురు జిల్లా అధ్యక్షుల పెర్‌ఫార్మెన్స్‌పై పెదవి విరిచినట్టు తెలుస్తోంది. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయలేదట. స్థానిక అంశాలనూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.చాలా జిల్లాలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తప్ప స్థానిక అంశాలపై ఆందోళనలు చేయడం లేదట. కొన్ని ప్రోగ్రామ్స్‌ను టిక్ మార్క్ వేయించుకోవడం కోసమే చేస్తున్నారట. పార్టీ బలోపేతానికి ఎలాంటి చొరవ చూపెట్టడం లేదని గుర్తించారు నాయకులు. తెలంగాణలో కిందిస్థాయిలో జరిగే కార్యక్రమాలు, కమిటీల వివరాలు ఎప్పటికప్పుడు సెంట్రల్ పార్టీకి రిపోర్ట్ చేయాలి. పెద్ద ఘటనలు జరిగినా వెంటనే స్పందించడం లేదట కొందరు లీడర్స్‌. చాలామంది జిల్లా అధ్యక్షుడు ఉత్సవ విగ్రహాలుగా కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జ్‌లతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. ఆ సందర్భంగా కొందరు జిల్లా అధ్యక్షులను సంజయ్‌ హెచ్చరించారట. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి జిల్లా అధ్యక్షుల కృషి ఎంతో ఉందని.. వారికి ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం ఇచ్చిందని సంజయ్‌ చెప్పారట. తెలంగాణలో కూడా పార్టీ కోసం కష్టపడితేనే గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టంచేశారట.ఇప్పటి వరకు జరిగిన సమీక్షలు.. అందిన నివేదికల ప్రకారం కొందరు బీజేపీ జిల్లా అధ్యక్షులను తప్పించే అవకాశం ఉందట. దాదాపు పది మందిపై వేటు పడొచ్చని అనుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ కొన్ని జిల్లాల అధ్యక్షులపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుందని బీజేపీలో చర్చ జరుగుతోందట.

Related Posts