YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆదాయానికి గండి కొడుతున్న బూడిద మాఫియా

ఆదాయానికి గండి కొడుతున్న బూడిద మాఫియా

కరీంనగర్, మార్చి 28,
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు.పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700 ఎకరాలలోయాజమాన్యం పెద్ద యాష్ పాండ్ ఏర్పాటుచేసింది. గతంలో ఈబూడిదను ఎవరూ వినియోగించేవారు కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం రూపాయికి టన్ను చొప్పున తీసుకవెళ్లండి అని చెప్పినా ఎవరూ ముందుకురాలేదు.రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో పాటు కేంద్రప్రభుత్వం బూడిదను ప్రోత్సహించటంతో గతఅయిదు సంవత్సరాలుగా బూడిదకు డిమాండ్ ఏర్పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేసిన తర్వాత గులాయిలలోఇసుకను నింపేవారు.రానురాను ఇసుక కొరత ఏర్పడటంతో సింగరేణిలో కూడా బూడిద వినియోగం బాగా పెరిగింది.బొగ్గుతీసిన తర్వాత గులాయిలలో ఇసుకకు బదులు బూడిదను నింపుతున్నారు.జాతీయ రహదారుల నిర్మాణానికి మట్టికి బదులుగా బూడిద వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న మంచిర్యాల-నాగపూర్, వికారాబాద్,సంగారెడ్డి, సూర్యాపేట జాతీయ రహదారుల నిర్మాణానికి సిమెంటు పరిశ్రమలు, ఇటుకబట్టిలు, ఇంటినిర్మాణాల కోసం బూడిదను వాడుతుండటంతో ఎన్టీపీసీ యాజమాన్యం ఈ బూడిదకు వేలంపాటను పెట్టింది. మొదట పది రూపాయలకు ఆక్షన్ పెట్టింది. క్రమక్రమంగా పోటీ పెరగడంతో యాజమాన్యం గత ఏడాది నవంబర్లో వేలంపాట నిర్వహించింది. పోటాపోటీగా కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఆరులక్షల 50 వేలక్యూబిక్ మీటర్లకు ఓకాంట్రాక్టర్ టన్నుకు 410 రూపాయలు ఎన్టీపీసీ యాజమాన్యంకు చెల్లించే విధంగా టెండర్ దక్కించుకున్నాడు. ఏటా రామగుండంకు నాలుగు కోట్లరూపాయలు బూడిదపై ఆదాయం వస్తుందని అంచనా వేశారు.అసలు కథ అప్పుడే మొదలైంది. రామగుండంలో ముఖ్యప్రజాప్రతినిధికి బూడిద మీద కన్నుపడింది.తన అనుచరులను రంగంలోకిదింపి టెండర్ వేసిన వ్యక్తిని బూడిద తరలించకుండా అడ్డుకొని రాత్రివేళలలో అక్రమంగా ఈమాఫియా బూడిదను తరలింపునకు శ్రీకారం చుట్టారు.టెండర్ వేసిన వ్యక్తికిచెందిన జేసీబీలతో అర్థరాత్రి లారీకి 20 వేలరూపాయల చొప్పున వసూళ్లు మొదలుపెట్టారు. ఇలారోజుకు వందల లారీల బూడిదను తరలించుకపోతున్నా ఎన్టీపీసీ ఆదాయంకు గండికొడుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ బూడిద అక్రమరవాణాకు తెరలేపారు కొందరు కేటుగాళ్ళు. రోజుకు 20 నుండి 30 లక్షలరూపాయల ఎన్టీపీసీ బూడిదను మాఫియా దోచుకుంటుంది.రామగుండంకి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి,అతని అనుచరులు ఓ గ్రూపుగా ఏర్పడి రాత్రివేళల్లో బూడిదను,ఇసుకను,అంతర్గాం,గోలివాడ,ఇసుక క్వారీనుండి వందలాది కాంట్రాక్టర్లు ఇసుకను దోచుకుపోతున్నారు. ప్రభుత్వం శాండ్ బుకింగ్ పెట్టి వినియోగదారులకు విక్రయిస్తుండగా, వాటికి మాఫియా గండికొట్టి దర్జాగా దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో ఓప్రజాప్రతినిధిపై రామగుండంలో యాష్, ఇసుకదోపిడీలో ఉన్నట్లు రాజకీయపార్టీలు విమర్శలు చేస్తున్నారు. కుందనపల్లి యాష్ పాండ్లో స్థానికప్రజాప్రతినిధి అనుచరులు మాఫియా ముఠాగా ఏర్పడి,రాత్రి రాత్రికి వందలాది లారీల యాష్ ను దోచుకుతిన్నారని, ఇందులో అధికారుల పాత్రఉందని దీనిపై సీబీఐ విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూడిదచెరువులో ఇటీవల పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీపీసీ ఆదాయానికి గండికొడుతున్న బూడిద మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts