YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ కీలక నిర్ణయం..

సీఎం జగన్ కీలక నిర్ణయం..

నెల్లూరు
గౌతమ్ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌతమ్ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతామని ప్రకటించారు.
 రాజకీయాల్లోకి తనను నేనే తీసుకురావడం జరిగింది. రా గౌతమ్ అని చెప్పి తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి... నేను అడుగులు వేస్తేనే తను అడుగులు వేశాడు. ఆ తర్వాత ఒక మంచి రాజకీయనాయకుడిగా కూడా తాను ఎదిగాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి... ఆ తర్వాత మంత్రిపదవి చేపట్టిన తర్వాత ఒక మంచి మంత్రిగా కొనసాగాడు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్తో పాటు దాదాపు ఆరుశాఖలు నిర్వహించాడని గుర్తు చేసుకున్నారు.
ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు ఇక్కడికి తీసుకుని రావాలి... ఇక్కడికి తీసుకుని వస్తే... రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుందని ఎప్పుడూ తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే బహుశా చివరి క్షణాల్లో దుబాయ్ వెళ్లాడు. వెళ్లేముందు నాకు కనిపించాడు. దుబాయ్కి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద నన్ను కలవాలని టైం కూడా అడిగాడు. అంతలోపే ఈ సంఘటన జరిగింది. ప్రతి సందర్భంలోనూ ఒక మంచి మంత్రిగా, మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా అన్నిరకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని అని చెప్పి... జీర్ణించుకోవడం కష్టంగా ఉందని సీఎం అన్నారు. .

Related Posts