YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

01 ఆర్ ఆర్ ఆర్ రాజీనేనా...

01 ఆర్ ఆర్ ఆర్ రాజీనేనా...

ఏలూరు, మార్చి 29,
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా ఇక లేనట్లే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానన్న ఆయన ఇప్పుడు రాజీనామా ఊసే ఎత్తడం లేదు. ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇంకా లోక్ సభ ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండటంతో రాజీనామా చేసి తాను మరో పార్టీ తరుపున గెలిచి జగన్ కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. అందుకే జగన్ పార్టీ మీద నేరుగా విమర్శలు చేస్తున్నారు. తాను అనుకున్నది... వారి ఎంపిక పూర్తయిందట రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు పిటీషన్ కూడా పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు దానిమీద ఎలాంటి చర్యలను స్పీకర్ తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి, నరసాపురం నుంచి జనసేన, బీజేపీ కాంబినేషన్ లో ఒక ఊపు ఊపేద్దామని భావించారు. కానీ బీజేపీ అగ్రనాయకత్వం రాజీనామా విషయం ఆలోచించమని చెప్పారని తెలిసింది. బీజేపీ హైకమాండ్ నుంచి..... ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండటం, ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజీనామా వద్దని ఆయనకు ఢిల్లీ పెద్దలు సూచించారని చెబుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కూడా తన ప్రాంతంలో నిరసనలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని రఘురామ కృష్ణరాజు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగేంత వరకూ వెయిట్ చేయాలని రఘురామ కృష్ణరాజుకు కొందరు సూచించినట్లు తెలిపింది. అందుకే తాను విధించిన డెడ్ లైన్ దాటి నెల గడుస్తున్నా ఆయన రాజీనామా ఊసు ఎత్తడం లేదంటున్నారు. బీజేపీ నుంచి చేరికకు క్లారిటీ లేకపోవడం, జిల్లా కేంద్రాల నిర్ణయం తర్వాతనే తన రాజీనామా ఉంటుందని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు రాజీనామా ఈసారికి ఇక లేనట్లే అనుకోవాలి.

Related Posts