YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎస్పీ వర్సెస్ ఎంపీ

 ఎస్పీ వర్సెస్ ఎంపీ

విశాఖపట్టణం, మార్చి 29,
ఖాళీ జాగా కనిపిస్తే చాలు నేతలు కబ్జాచేస్తున్నారు. ప్రభుత్వ, అటవీ, బంజరు, చెరువు, ఈనాం ఇలా భూములు ఏవైనా సరే హాంఫట్‌ అనిపిస్తున్నారు. ఎకరాలకొద్దీ స్వాధీనం చేసుకుని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. కొందరైతే అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అడ్డొచ్చినవారి సంగతేంటో తేల్చేస్తున్నారు. రికార్డుల్లో ఏమాత్రం లొసుగులు ఉన్నా ప్రైవేటు భూములను ఆక్రమించేస్తున్నారు. ఇచ్చింది తీసుకుని స్థలం ఖాళీచేయాలంటూ హెచ్చరిస్తున్నారు. మాట వినకుంటే రౌడీమూకలు, పోలీసులను రంగంలోకి దింపి బెదిరిస్తున్నారు. కొత్త రికార్డులను సృష్టించి కోర్టులపాలు చేస్తున్నారు. కేసులు కోర్టుల్లో ఉండగానే ఆ భూములను అడ్డగోలుగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి భూ రాబందులుగా మారిపోతున్నారు.రూపాయి.. రూపాయి కూడబెట్టి కొనుకున్న స్థలంలో ఎవరో వచ్చి రోడ్డు వేసుకుంటే తానూ ఎలా భరిస్తానని వాపోయాడు విశాఖ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ మధు. తన వెంచర్‌ సౌలభ్యం కోసం ఒకమాట కూడా చెప్పకుండా ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇది కాస్తా.. ఎంపీ వర్సెస్‌ ఐపీఎస్‌గా మారిపోయింది. ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎంపీ ఎంవీవీకి చెందిన కొత్త వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అది పక్కనే ఉన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధుకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.విశాఖలోని బక్కన్నపాలెం సర్వే నంబర్‌ 90/1A లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీ మధు కాంపౌండ్‌ వాల్‌ నిర్మిస్తుండగా.. ఎంవీవీ అనుచరులు అడ్డుకున్నారు. ఈ విషయంపై పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో మధు ఫిర్యాదు చేశారు. తన స్థలంలో ఎంవీవీ వెంచర్‌ కోసం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారని ఆరోపించారు. అది గమనించి తన స్థలంలో కాంపాండ్‌వాల్‌ నిర్మిస్తుండగా అడ్డుకున్నారని చెప్పారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఎస్పీ మధు ప్రశ్నించారు. ఎస్పీ మధు చేసిన ఆరోపణలను ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ ఖండించారు. మధు అర్థరాత్రి అక్కడ గోడ నిర్మిస్తుండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. వారి ఫిర్యాదుతో అనుమానం వచ్చి పనులు ఆపేశామన్నారు. రికార్డ్స్‌లో అది లే అవుట్‌ రోడ్‌గా చూపిస్తోందన్నారు ఎంవీవీ సత్యన్నారాయణ. ఆ భూమి నిజంగానే ఎస్పీ సొంతమైతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఎంవీవీ సత్యన్నారాయణ.

Related Posts