విజయవాడ, మార్చి 29,
సోము వీర్రాజు ఇటు ఓపెన్ హార్ట్‌లో బిజీగా ఉన్నారు. అటు, విజయవాడలో ఆదివారం ఆయనతో సంబంధం లేకుండా బీజేపీ యాక్టివ్ నేతలు ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఆ భేటీకి హాజరైన వారంతా పక్కా జగన్‌రెడ్డి యాంటీ బ్యాచ్. హార్డ్‌కోర్ కమల దళం. ఇక, సీఎం జగన్‌కు అనుకూల వర్గంగా ముద్రపడిన సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి లాంటి నేతలెవరికీ ఆ మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్ లేదు. ఏకంగా పార్టీ అధ్యక్షునికే సమాచారం లేకుండా జరిగిన ఆ సమావేశం ఇప్పుడు ఏపీ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. వీర్రాజుపై విసుగుచెందిన కొందరు బీజేపీ లీడర్స్.. ఆ మీటింగ్‌లో గట్టి వాయిస్ వినిపించడం.. త్వరలోనే సోముకు చెక్ పెడతారంటూ ప్రచారం జరుగుతుండటం ఆసక్తికర పరిణామం.విజయవాడలో ఓ హోటల్‌లో జరిగిందీ ఆ కీలక సమావేశం. పైకి మాత్రం జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో.. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకూమార్‌కు ఆత్మీయ సమావేశం పేరుతో ఈ సభ జరిగింది. అయితే, ఆ మీటింగ్ వెళ్లిన వారంతా యాంటీ వీర్రాజు.. యాంటీ జగన్‌రెడ్డి వర్గం కావడం ఇంట్రెస్టింగ్ పాయింట్. కన్నా లక్ష్మినారాయణ, లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలీప్, పాతూరి నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రమేష్ నాయుడు, షేక్ బాజీ, శ్రీనివాసరాజు తదితరులు బెజవాడ భేటీకి హాజరయ్యారు. యూపీలో బీజేపీ గెలుపునకు కృషి చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ను అంతా పొగడ్తలతో ముంచెత్తారు. యూపీలానే ఏపీలోనూ.. బీజేపీ ఎదుగుదలకు ప్రయత్నించాలని సత్యకుమార్‌ను కోరారు. ఇక, ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని.. రాజధాని అమరావతిని కదిలించే శక్తి, వ్యక్తి దేశంలో ఇంత వరకు ఎవరూ పుట్టలేదని, భవిష్యత్తులో పుట్టబోరని సత్యకుమార్ సైతం స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సోము వీర్రాజు లేకుండా విజయవాడలో ఇంతటి కీలక సమావేశం జరగడం.. పలు ఊహాగానాలకు ఛాన్స్ ఇస్తోంది. బీజేపీలో ఉన్న వైసీపీ ఫేవర్ బ్యాచ్‌కు చెక్ పెట్టేందుకే.. ఈ భేటీ జరిగిందని అంటున్నారు. అధ్యక్ష మార్పుపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలతో నేరుగా మాట్లాడగల పలుకుబడి ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ముందు వారంతా వీర్రాజు వ్యవహార శైలిపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. వైసీపీ భజన చేస్తూ.. అధికారపార్టీని వదిలేసి ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడే సోము, విష్ణులాంటి వారితో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతోందని ఆ వర్గమంతా ఆగ్రహంతో ఉంది. అందుకే, వీర్రాజుకు వల్లూరి జయప్రకాష్ నారాయణ-జేపీతో చెక్ పెట్టాలనేది వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే సోముపై అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందడం, జగన్-వైసీపీతో ఏపీ బీజేపీ అంటకాగుతుండటం, జనసేనానిని కలుపుకోలేక పోతుండటం, అమిత్‌షా చెప్పినా అమరావతి ఇష్యూను టేకప్ చేయకపోవడం.. ఇలా వీర్రాజు ఫెయిల్యూర్స్‌పై అసలైన కాషాయవాదులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే, విజయవాడ తరహా ప్రత్యేక సమావేశాలతో మరింత మద్దతు కూడగడుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే సోమును అధ్యక్ష పదవి నుంచి సాగనంపే అవకాశాలు ఎక్కువే అంటున్నారు.