YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు

పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు

విజయవాడ, మార్చి 30,
ఆంధ్ర ప్రదేశ్’ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. అయితే, ఎన్నికల వేడి మాత్రం అప్పుడే మొదలైంది. మరో వంక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్న పుకార్లు షికారు చేస్తున్న నేపధ్యంలో, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలో దిగేందుకు పార్టీలే కాదు, నాయకులు కూడా సిద్దముతున్నారు.అందులో కొందరు పార్టీలు మారేందుకు కూడా రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా, ఇంకొందరు అసంతృప్తులు, తెలుగు దేశం, జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సంగతి ఎలా ఉన్నా, తెలుగు దేశం, జనసేన పొత్తు ఆల్మోస్ట్, పక్కా అని తేలిపోవడంతో స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణలు, ఇప్పటికే ఆయా పార్టీలలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి మధ్య పోటీ, టోటల్’గా టికెట్ వచ్చే అవకాశం చివరకు ఏ పార్టీలో  చేరితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయో బేరీజు వేసుకుని, అయితే టీడీపీ కాదంటే జనసేన పార్టీలో చేరేందుకు కర్చీఫ్’లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, బీజేపీ ఒంటరి పోరాటం వైపు మొగ్గు చూపుతున్న సంకేతాలు స్పష్టమవుతున్ననేపధ్యంలో కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నాయకులు, కొందరు మాజీ మంత్రులు కూడా, బీజేపీలో తమకు రాజకీయ భవిష్యత్ లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కోవలో ఇంచుమించుగా ఓ డజను మందికి పైగా నాయకులు బీజేపీకి గుడ్’బై చెప్పేదుకు సిద్డంగ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొందరు, టికెట్ హామీ ఇస్తే నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇంకొందరు, జనసేనలో చేరి, తెలుగు దేశం మద్దతుతో తమ  రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా, జనసేన వైపు చూస్తున్న నేతల్లో ఇప్పటికే చాలా పార్టీలు మారిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు వినిపిస్తోంది .2004 వరకు టీడీపీలో ఉన్న ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం లేరు. వైసీపీ నుంచి టీడీపీ.. మళ్లీ టీడీపీ నుంచి వైసీపీ చేరారు. అధికార పార్టీలో ఉన్నా ఆయనకు సరైన గుర్తింపు లేదు. అందుకే ఆయన మళ్ళీ మాతృ సంస్థలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే విధంగా  ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా, జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన, టీడీపీ పొత్తుపెట్టుకుంటేనే ఆ పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ విపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించి నప్పటి నుంచి, పార్టీల కంటే ఎక్కువగా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న నాయకులు, క్షేత్ర స్థాయిఫై దృష్తి పెట్టి, లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం, జనసేన కలిస్తే, పార్టీలకు ఆతీతంగా, వైసీపీ వ్యతిరేక ఓటు కూటమికి అనుకూలంగా కన్సాల్డేట్’ అవుతుందని,ఆ విధంగా టీడీపీ కూటమి గెలుపు సునాయసమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే, ఎన్నికలు దూరంలో ఉన్నాయి కాబట్టి, ఇప్పటి నుంచే ఎన్నికల పొత్తుల గురించి తొందర ఎందుకని అనుకుంటే కుదరదని, ముందుగా పొత్తు ఖరారు చేసుకోవడంతో పాటుగా సీట్ల పంపకాల విషయంలోనూ ఎంత త్వరగా స్పష్టత వస్తే అంత మంచిదని విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా ప్రజాసమస్యలపై ఇప్పటినుంచే ఉమ్మడి పోరాటాలు చేయడం వలన ఉభయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య అవగాహాన, సయోధ్యత పెరుగుతుందని, తద్వారా ఎన్నికల సమయానికి మంచి అవగాహానతోటో కలిసి పని చేయగలుగుతారని అంటున్నారు. అదే విధంగా ఆఖరి నిముషం వరకు పొత్తులపై స్పష్టత లేకే పోతే, ఓటు ట్రాన్స్ఫర్ సక్రమంగా జరగదని అంటున్నారు. అయితే, ఇప్పుడు బంతి జనసేన కోర్టులో వుంది. బీజేపీతో కలిసి ప్రయాణం చేసి వైసీపీకి మరో అవకాశం ఇవ్వడమా, టీడీపీతో చేతులు కలిపి వైసీపేని ఓడించడమా అనేది  తేల్చుకోవలసింది జనసేన పార్టీనే అంటున్నారు. అలాగే, నాలుగు పదుల అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దన్న పాత్రను పోషించి, జనసేనతో పొత్తుకు చొరవ చూపాలని విశ్లేశకులు బావిస్తున్నారు.

Related Posts